Hyd Attack: హైదరాబాద్ నగరంలో ముంబై నటికి చేదు అనుభవం ఎదురైంది. దుకాణం ప్రారంభోత్సవం పేరుతో పిలిచి ఆ తర్వాత ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అందుకు నిరాకరించడంతో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ముంబైకు చెందిన బాలీవుడ్ సినిమాలత పాటు టీవీ సీరియళ్లలో నటిస్తుంటారు. మార్చి 17న హైదరాబాద్ రావాలని ఓ స్నేహితు రాలు ఆహ్వానించింది. నగరంలోని దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని కార్యక్రమంలో పాల్గొన్నందుకు విమానఛార్జీలు, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది.ఆమె మాటలు నమ్మి ఈ నెల 18న నగరానికి వచ్చిన సదరు యువతిని మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో బస చేశారు.
హైదరాబాద్‌లో యువతి బస చేసిన ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. 21వ తేదీన రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్మెంట్‌కు వెళ్లి ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి తెచ్చారు. ఎదురు తిరిగిన ఆమెపై వారు దాడి చేశారు. బాధితురాలు గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ముగ్గురు పారిపోయారు.
ఆ తర్వాత వృద్ధురాలు, ఇద్దరు మహిళలు ఆమెను గదిలో బంధించి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు తీసుకుని వెళ్లిపోయారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని మాసబ్ ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ముంబై నటిని ఆహ్వానించిని యువతి కోసం గాలిస్తున్నారు.
సంబంధిత కథనం