Blinkit warehouse: జొమాటో బ్లింకిట్ గోడౌన్‌లో కాలం చెల్లిన ఆహార పదార్ధాలు సీజ్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
Blinkit warehouse: హైదరాబాద్‌లో బ్లింకిట్ గోదాములో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు: కాలం చెల్లిన ఆహారం, పురుగుమందు, పప్పు స్వాధీనం ఈ కేంద్రంలో ప్రాథమిక పరిశుభ్రత ప్రోటోకాల్స్ లేకపోవడం వల్ల అనేక ఉల్లంఘనలు జరిగాయని ఆహార భద్రతా విభాగం తెలిపింది.
Blinkit warehouse: జొమాటో క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ కు చెందిన గోదాముaపై హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. ఈ దాడి వివరాలను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. జోమాటో కేంద్రంలో ప్రాథమిక పరిశుభ్రత ప్రోటోకాల్స్ లేకపోవడంతో పాటు అనేక నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆహార భద్రతా విభాగం తెలిపింది. గడువు తీరిన ఆహార పదార్థాలను కూడా గోడౌన్‌లో గుర్తించినట్లు తెలిపింది.
జోమాటో బ్లింకిట్ గోడౌన్‌లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ తెలిపారు, "ఆహార పదార్ధాలను నిల్వ చేసే ర్యాక్‌ల వద్ద ప్రాంగణం అంతా అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా దుమ్ముతో ఉన్నట్లు గుర్తించారు.
ఫస్టాక్ ట్రైనీ అందుబాటులో లేకపోవడం, కార్మికులు హెడ్ గేర్లు, గ్లౌజులు, ఏప్రాన్లు లేకుండా విధులు నిర్వహించడం, ఆహార పదార్ధాల విక్రయాల వద్ద ఫుడ్ హ్యాండ్లర్లు శుభ్రత పాటించకపోవడం గుర్తించారు.
ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని, ఆహార ఉత్పత్తులతో పాటు సౌందర్య ఉత్పత్తులను భారీగా నిల్వ చేశారని నివేదికలో పేర్కొన్నారు. లేబుల్ పై పేర్కొన్న చిరునామాకు FSSI చట్టం ప్రకారం లేకపోవడంతో నోటీసులు పంపనున్నారు.
కామాక్షి ఫుడ్స్ లైసెన్స్ గడువు ముగియడంతో రూ.30 వేల విలువైన సుజీ, రా పీనట్ బటర్, మైదా, పోహా, శెనగపిండి, సజ్జ ఉత్పత్తులను సీజ్ చేశారు. రూ.52 వేల విలువ చేసే కందిపప్పు, కందిపప్పును స్వాధీనం చేసుకుని నమూనాలను ల్యాబ్ కు పంపించారు. నివేదికల ఆధారంగా అయా సంస్థలకు నోటీసులు జారీ చేసి, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు.