తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహరచన-bjp working out strategy for lok sabha polls to win at least 10 seats ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహరచన

తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహరచన

HT Telugu Desk HT Telugu
Dec 25, 2023 08:38 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అనే భావనను తీసుకురావడానికి స్పష్టమైన, పదునైన లక్ష్యంతో తెలంగాణ బీజేపీ ముందుకు సాగుతోంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి (ANI)

2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కనీసం 10 స్థానాలను గెలుచుకునే అవకాశాలను మెరుగుపర్చడానికి, తన ఓటు శాతాన్ని పెంచుకోవడానికి అనేక సంస్థాగత చర్యలను అమలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హెచ్ టికి చెప్పారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019లో బీజేపీ 4 స్థానాలను గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి) 9, కాంగ్రెస్ 3, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.

ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోందని, క్లస్టర్ల వారీగా కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారని, డిస్ట్రిబ్యూటెడ్ లీడర్‌షిప్ విధానాన్ని అవలంబించారని ఈ పరిణామాల గురించి తెలిసిన బీజేపీ రాష్ట్ర నేత ఒకరు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓటరు బేస్ పెంచుకోవడం, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ రెండో ప్రత్యర్థిగా ఉన్న మరో 19 స్థానాల్లో ఎక్కువ మంది కార్యకర్తలను మోహరించడం పార్టీ ముందున్న రెండు లక్ష్యాలని ఆయన చెప్పారు.

2018లో 6.10 శాతంగా ఉన్న బీజేపీ ఓట్ల శాతం మొన్న నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14.02 శాతానికి రెట్టింపు అయ్యాయి. కాంగ్రెస్ 39.40 శాతం ఓట్లను సాధించడంలో ముస్లిం ఓట్లు సహాయపడ్డాయని అవగతమవుతోంది. కాంగ్రెస్ 2018 ఎన్నికలతో పోలిస్తే 10% అదనంగా ఓట్లు సాధించింది. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక అంశం పనిచేసింది. ఇది దాని ఓట్ల శాతం 37.35 శాతానికి తగ్గడానికి దారితీసింది. 2018తో పోల్చితే దాదాపు 10% ఓట్లు కోల్పోయింది.

ఉత్తర తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో విజయాలు నమోదు చేసింది. పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ ఛార్జి పి.మురళీధర్ రావు మాట్లాడుతూ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అనే భావన వచ్చేలా జోరుగా ప్రచారం చేయాలని చూస్తున్నాం..’ అని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే రేసులో ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ చేజిక్కించుకోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలను బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్య ప్రత్యక్ష ద్విముఖ పోటీగా భావించనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ మార్పును తోసిపుచ్చినప్పటికీ, స్థానిక నాయకులకు బాధ్యతలను వికేంద్రీకరించడం ద్వారా సహకార నాయకత్వ నమూనాను పార్టీ అమలు చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.

పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా ప్రతి క్లస్టర్ కు ప్రధాన కార్యదర్శులను నియమించడంతో పాటు కేంద్ర నేతలు కీలక నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ''చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సరళమైన ప్రచారం జరుగుతుందని, 2024 ఎన్నికల్లో 25 శాతానికి పైగా ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చుగ్ తెలిపారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 20 శాతం ఓట్లు వచ్చాయి.

అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో మద్దతు కూడగట్టుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని, అందువల్ల ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు రెండు వారాల ముందు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించినప్పటిలా కాకుండా, తమ అంతర్గత కమిటీ ఇప్పటికే 10 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాయకులను ఖరారు చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం, బిఆర్ఎస్ తన ఎన్నికల యంత్రాంగాన్ని పునరుజ్జీవింపజేయాలని చూస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవడానికి తమకు తగినంత అవకాశం ఉందని బిజెపి భావిస్తోంది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓబీసీలు, ఎస్సీల నుంచి ఎక్కువ ఓట్లు రాబట్టాలన్న బీజేపీ ఎత్తుగడ రాష్ట్ర ఎన్నికల్లో వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. బీసీ సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తమ స్థానాలను నిలబెట్టుకోలేకపోయారు. ఈ కారణంగానే బీజేపీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే పసిగట్టి లోక్ సభ ఎన్నికలకు ముందుగానే పనిచేయాలని తన క్యాడర్ పై ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకుడు కోటేశ్వరరావు అన్నారు.

Whats_app_banner