Telangana: బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’… స్పీడ్ మరింత పెంచబోతుందా..?-bjp telangana leaders claims numerous trs and congress leaders ready to join the party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Telangana Leaders Claims Numerous Trs And Congress Leaders Ready To Join The Party

Telangana: బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’… స్పీడ్ మరింత పెంచబోతుందా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 06, 2022 03:16 PM IST

ఆపరేషన్ ఆకర్ష్ పై బీజేపీ తెలంగాణ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంలో గతానికి భిన్నంగా మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తోంది.ఎమ్మెల్యే కోమటిరెడ్డితో ప్రారంభమయ్యే చేరికలను… కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ విషయంలో పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

'Bjp Operation Akars: ఆపరేషన్ ఆకర్ష్'ను పక్కా అమలు చేస్తోంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. కొద్దిరోజులుగా స్పీడ్ ను పెంచేసింది. ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేయగా... కీలక నేతలను లైన్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా... త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే మరో 12 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వస్తారంటూ బీజేపీ నేతలు... వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరే కాదు... ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా కమలదళంలోకి రాబోతున్నారంటూ హింట్ లు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

చేరికలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఓ లెవల్ లో మాట్లాడుతుండటంతో ప్రధాన పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఒకేసారి కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికపై క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజాగా రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కూడా... బీజేపీలో చేరబోతున్నారు. పార్టీ అధినేత బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అయితే పార్టీలో చేరికలపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 21న చేరే లిస్ట్ ఇదేనంటూ పలువురి పేర్లు ప్రస్తావించారు. మరింత మంది కూడా వస్తారని చెప్పుకొచ్చారు.ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్, కన్నెబోయిన రాజయ్య యాదవ్ తో పాటు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్ వంటి నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఈ జాబితాలో ఉంటారని చెప్పారు. ఇక బండి సంజయ్… 12 మంది ఎమ్మెల్యేలు అనటంతో… ఎవరా అన్న చర్చ కూడా మొదలైంది.

ఈనెల 21న తనతో పాటు చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వారందరూ బీజేపీలో చేరుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చాలా మంది బీజేపీ వైపు చేస్తున్నారని చెప్పారు. ఇక తన సోదరుడు ఎంపీ వెంకట్ రెడ్డి కూడా ఆలోచిస్తారంటూ కామెంట్ చేయటం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే వెంకట్ రెడ్డి.. హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వరద సాయంపై అని ఆయన చెప్పినప్పటికీ.... పార్టీ మారటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచి సత్తా చాటిన బీజేపీ... మునుగోడు గడ్డపై కూడా బీజేపీ జెండాను ఎగరవేయాలని చూస్తోంది. తద్వారా తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగాలని వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో మరింత స్పీడ్ పెంచాలని భావిస్తుందట.! ఈ నెలలోనే భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరింత వెళ్తారా..? ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం