అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెడుతున్నాయి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-bjp mp laxman interesting comments about ys sharmila and kalvakuntla kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెడుతున్నాయి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెడుతున్నాయి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయని.. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయని.. ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తండ్రులు సంపాదించిన ఆస్తులు, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెడుతున్నాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వైఎస్ షర్మిల, కవిత

అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు వారి మీదనే గురిపెడుతున్నాయని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌పై చెల్లి షర్మిల బాణం ఎక్కుపెడితే.. తెలంగాణలో కేటీఆర్‌పై కవిత గురిపెట్టిందని అన్నారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడాని ప్రజల అవసరాల కంటే.. కుటుంబ అవసరాలే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది..

'మొన్న వైఎస్సార్ కుటుంబం.. ఇపుడు కేసీఆర్ కుటుంబం.. అన్నలపైకి చెల్లెల్లను ఉసి గొల్పడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది. రేవంత్ బీద అరుపులు అరుస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పుట్టి మునిగిపోయింది. దేశంలో బీజేపీ వెలిగిపోతోంది' అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌కు కవిత సవాల్..

'తెలంగాణలో బీజేపీ బలపడింది. భవిష్యత్‌లో అధికారంలోకి కూడా రానుంది. కవిత లేఖ రాసింది వాస్తవమే.. కవిత కేసీఆర్‌ను కలిసే పరిస్థితి లేదా? కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కేటీఆర్‌ను కవిత సవాలు చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పకనే చెపుతోంది. అన్న ఆధిపత్యాన్ని సవాలు చేయడమే లేఖాస్త్రం' అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

వికసిత భారత్ సిద్ధిస్తోంది..

'కవిత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. భారతదేశం ఆర్ధికంగా అత్యంత బలోపేతంగా నిలుస్తోంది. భారత దేశం 4వ ఆర్థిక అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందింది. జపాన్‌ను అధిగమించింది భారత్.. మోదీ నాయకత్వానికి తార్కాణం. వికసిత భారత్ కూడా కచ్చితంగా సిద్ధిస్తుంది. పీఎం మోదీకి శుభాకాంక్షలు. ప్రభుత్వం.. ప్రతిపక్షం అనే వత్యాసం లేకుండా పని చేస్తున్నాం' అని లక్ష్మణ్ వివరించారు.

ఒరిగేదేమీ లేదు..

'14 రాష్ట్రాల్లో అధ్యక్షుల ప్రకటన జరిగింది. ఆలిండియా ప్రెసిడెంట్ తోపాటు ఇతర రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగనుంది. పహల్గాం ఘటన తర్వాత తలెత్తిన పరిస్థితులతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయింది. కవిత పార్టీతో ఒరిగేదేమీ లేదు. ఆమె అస్తిత్వం కోసమే పార్టీ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఉండదు' అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

సంబంధిత కథనం