తాము మేకిన్ ఇండియా అంటే.. కేసీఆర్ జోకిన్ ఇండియా అంటున్నారని కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. హేళన చేయకుండా ప్రోత్సహిస్తే.. బాగుంటుందని తెలిపారు. మోదీ ప్రత్యేక విజన్ తో తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 5ఎఫ్ విజన్ తో తెలంగాణ(Telangana)లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ పథకం కింద రూ.4,445 కోట్లు కేటాయించారన్నారు.,'ఒక్కో టెక్స్ టైల్ పార్క్ కు కనీసం వెయ్యి ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశాం. అంతర్జాతీయ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నాం. వరంగల్(Warangal)లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వచ్చే నెలల ప్రధాని మోదీ రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. త్వరలో హైదరాబాద్ టూ తిరుపతి వందేభారత్(vande bharat) రైలు ప్రారంభం కానుంది. ఏదైనా మంచి జరిగితే.. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) తమ ఖాతాలో వేసుకుని.. చెడు జరిగితే.. బీజేపీ కుట్ర అంటున్నారు.' అని కిషన్ రెడ్డి అన్నారు.,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ(BJP) అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు బీజేపీతో మార్పు వస్తుందని భావించేందుకు ఈ ఎన్నికల ఫలితమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా టెక్స్ టైల్స్ రంగంలో తెలంగాణకు మెగా టెక్స్ టైల్స్ పార్కును కేంద్రం కేటాయించిందన్నారు. వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందన్నారు.,ఈ పార్కుతో ప్రత్యక్షంగా లక్ష మందికి.. పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుందని కిషన్ రెడ్డి చెప్పారు. పలు దేశాలతో టెక్స్ టైల్(textile) ఉత్పత్తుల ఎగుమతుల మీద ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి(TSPSC Paper Leak), బీజేపీకి ఏం సంబంధముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటంబం మద్యం వ్యాపారం చేస్తే.. తమకు వచ్చే నష్టమేమి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) విజయం సాధించి.. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.,