Bandi Sanjay : భైంసానే కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు
Bandi Sanjay Praja Sangrama Yatra : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిర్మల్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిర్మల్(Nirmal) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తాటిపల్లి వద్ద అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు(Police), బండి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ముందుగా పాదయాత్ర(Padayatra)కు అనుమతిచ్చి.. చివరి నిమిషంలో ఎందుకు నిరాకరించారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసాలో మెుదలుకావాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ నుంచి కోరుట్ల వైపు వెళ్లారు.
ఓ వైపు సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP) శ్రేణులు ధర్నాకు దిగాయి. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక ఇలా అడ్డుకుంటున్నారన్నారు. బండి సంజయ్ యాత్ర ప్రజల కోసం.. చేస్తున్న యాత్ర అన్నారు. పోలీసుల అడ్డగింత నేపథ్యంలో కరీంనగర్ వెళ్తున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు.
'నిర్మల్ లో కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు. ఎస్పీని కలవడానికి వెళుతున్నా అడ్డుకుని దారుణంగా కొడుతున్నారు. భేషరతుగా కార్యకర్తలను విడుదల చేయాలి. మీరు రెచ్చకోట్టినా మేం సoయంనంతో ఉన్నాం. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు. బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దు. బైంసానే కాపాడలేని CM రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు.? CMకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. పోలీసుల రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు కరీంనగర్ పోతున్న. సోమవారం మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉంది. అప్పటివరకు వెయిట్ చేస్తాం.' అని బండి సంజయ్ అన్నారు.
నిర్మల్ జిల్లాలో ప్రారంభం కానున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర(Bandi Sanjay Praja Sangrama Yatra)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇటీవలే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు యాత్రకు అనుమతి కోరారు. భైంసాలో శాంతిభద్రతల కారణంగా అనుమతిని పోలీసులు నిరాకరించారు. ఈ మేరకు నిర్మల్ ఎస్పీ సురేశ్ ప్రకటించారు.
ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) నాలుగు విడతలు ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సిద్ధమయ్యారు. ఇక ఈ పాదయాత్ర నవంబర్ 28 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు రూట్ మ్యాప్(Route Map) కూడా ఖరారైంది. భైంసా నుంచి కరీంనగర్(Karimnagar) వరకు పాదయాత్రను ప్లాన్ చేశారు. 3 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలనుకున్నారు.
భైంసాలో ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కూడా పిలిచారు. ఈ పాదయాత్ర నిర్మల్, ఖానాపూర్, వేములవాడ(Vemulawada), జగిత్యాల, చొప్పదండి మీదుగా సాగి కరీంనగర్ లో ముగింపు సభ ఉండేలా ప్లాన్ చేసింది బీజేపీ. ఆ పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బండి సంజయ్ నిర్మల్ కు బయలుదేరారు. ఈ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంబంధిత కథనం