Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ ఏటీఎం దొంగలు హల్ చల్, పోలీసులపై కాల్పులు
Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ దొంగల ముఠా రెచ్చిపోయింది. బీదర్ లో ఏటీఎం వ్యానుపై కాల్పులు జరిపి... ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో దుండగలు మరోసారి కాల్పులకు తెగబడ్డారు.
Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ దొంగల ముఠా కాల్పులకు తెగబడింది. కర్ణాటకలోని బీదర్ లో ఏటీఎం వ్యాన్ పై కాల్పులు జరిగి భారీగా డబ్బు చోరీ చేసి పరారైన గ్యాంగ్ హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. బీదర్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అప్జల్ గంజ్ లో పోలీసులను చూసిన దొంగల ముఠా...తప్పించుకునేందుకు పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ గాయాలయ్యాయి. కాల్పుల ఘటనలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. కాల్పుల ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాల్పుల అనంతరం దుండగులు రాయ్ పూర్ పారిపోతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, హైదరాబాద్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు...గురువారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు అప్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్‌లో రాయపూర్‌కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ ఆఫీసుకు వచ్చారు. వీరిని మినీ బస్సులు ఆగే పాయింట్ వద్దకు తీసుకెళ్లడానికి ట్రావెల్స్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఈ సమయంలో దుండగుల వద్ద ఉన్న బ్యాగ్ ను ట్రావెల్స్ సిబ్బంది చెక్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్లు డబ్బులు తీసి ట్రావెల్స్ సిబ్బందికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్పటికే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దొంగలు తమ బ్యాగులో నుంచి తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్‌కు బుల్లెట్ గాయం అయ్యింది. మరో వ్యక్తికి గాయమైనట్లు తెలుస్తోంది.
నిందితుల కోసం నాలుగు బృందాలు రంగంలోకి
బీదర్ ఏటీఎం దొంగల కోసం హైదరాబాద్‌లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మొత్తం అలర్ట్ ప్రకటించామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలాస్వామి తెలిపారు. ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యాయని తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్న డీసీపీ.... డబ్బుల కట్టలతో నిందితులు పారిపోయారని చెప్పారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
ఏటీఎం వ్యాన్ పై కాల్పులు ఇద్దరు మృతి
కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. బీదర్ లోని శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు ఇద్దరు దొంగరు. ఈ ఘటనలో ఏటీఎం వ్యాన్ సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఇద్దరు దొంగలు ఏటీఎం డబ్బుతో ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ముఠా హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. పోలీసులను గమనించిన నిందితులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు.
బీదర్ లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు ఈ సంఘటన జరిగింది. దొంగల ముఠా రూ.93 లక్షల నగదుతో పారిపోయారు. ఏటీఎంలో డబ్బు పెట్టే వాహనాన్ని ముందు నుంచీ అనుసరించిన దొంగలు, బ్యాంకు వద్ద దాడి చేశారు. వాహనంలోని గార్డులలో ఒకరైన గిరి వెంకటేష్ దుండగుల కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా, మరొక గార్డు శివకుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. శివకుమార్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అతడూ మరణించాడు. కాల్పులు జరపడానికి ముందు దొంగలు ఏటీఎం వ్యాను గార్డులపై కారం పొడి చల్లారు. బీదర్ ఎస్పీ ప్రదీప్ గుంటి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
సంబంధిత కథనం