Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!-bhongir lorry diesel tank got fire in petrol bunk locally controlled fire ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Bandaru Satyaprasad HT Telugu
May 19, 2024 09:47 PM IST

Bhongir Fire Accident : భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్ బంక్ లో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం బంక్ లోకి వచ్చిన లారీ నుంచి ఒక్కసారి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బంక్ సిబ్బంది మంటనలు అదుపు చేశారు.

పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!
పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Bhongir Fire Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భువనగిరి శివారులోని నయారా పెట్రోల్ బంకులో లారీ డీజిల్ ట్యాంకు ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.

పేలిన లారీ డీజిల్ ట్యాంక్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులోకి వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకులోకి రాగానే లారీ డీజిల్‌ ట్యాంక్ ఒక్కసారి పేలిపోయింది. దీంతో లారీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మంటలు అదుపులోకి రాకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిన 10 మందికి గాయాలు

హైదరాబాద్‌లో ఇటీవల బైక్‌ పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలో పదిమంది గాయపడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌ పీఎస్‌ పరిధిలో ఇటీవల ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మొఘల్‌పురా అస్లా ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో రోడ్డుపై వెళుతున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి వెంటనే వాహనాన్ని ఆపేశాడు. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. బైక్‌పై వాటర్‌ పైప్‌తోనీళ్లు పోసి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. బైక్ చుట్టూ గుమిగూడి ఉన్న వారు ఈ ఘటనలో గాయపడ్డారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టూరిస్టు బస్సులో మంటలు, 9 మంది సజీవదహనం

హర్యానాలోని నూహ్ లో శనివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే పైన టూరిస్టులు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. 13 మందికి పైగా మంటల వల్ల తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. యూపీలోని మథుర నుంచి పంజాబ్ లోని జలంధర్ కు టూరిస్టులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మథురలోని బృందావనాన్ని సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన టూరిస్టులు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు వెనక భాగంలో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయని తెలుస్తోంది.

ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసి పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. ఎన్నికల్లో ఓటు వేసి తిరుగు ప్రయాణమైన వారిని క్షణాల్లో అగ్నికీలలు కమ్మేశాయి.

Whats_app_banner