Bharat Biotech : భారత్‌ బయోటెక్‌ నాసల్ వ్యాక్సిన్ విజయవంతం-bharat biotech s intranasal covid vaccine proven safe in clinical trials know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bharat Biotech's Intranasal Covid Vaccine Proven Safe In Clinical Trials Know In Details

Bharat Biotech : భారత్‌ బయోటెక్‌ నాసల్ వ్యాక్సిన్ విజయవంతం

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 08:44 PM IST

భారత్‌ బయోటెక్‌ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ విజయవంతమైంది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

క్లినికల్ ట్రయల్స్‌లో కొవిడ్ -19 ఇంట్రానాసల్ వ్యాక్సిన్ సురక్షితమైనదని, బాగా తట్టుకోగలదని నిరూపితమైనట్టు భారత్ బయోటెక్ పేర్కొంది. BBV154 (ఇంట్రానాసల్ వ్యాక్సిన్) కోసం ఫేజ్ 3 ట్రయల్స్, బూస్టర్ డోస్‌ల కోసం క్లినికల్ డెవలప్‌మెంట్‌ను పూర్తి చేసింది. 'ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు, BBV154 ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించినందుకు మేం గర్విస్తున్నాం. ఆవిష్కరణలు, ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి సారించాం. భారత్ బయోటెక్‌లోని బృందాలకు ఇది మరో విజయం.' అని భారత్ బయోటెక్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని భారత్ బయోటెక్ తెలిపింది. వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని పేర్కొంది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేశామని, వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని ప్రకటించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రయోగాల రిపోర్ట్ ను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వివరించింది.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో భారత ప్రభుత్వం ఈ టీకా అభివృద్ధి, ప్రయోగాలకు సహకరించిందని భారత్ బయోటెక్ ప్రకటనలో తెలిపింది. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలను జరిగాయి. ఈ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్ర పర్చి సులభంగా రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

సుమారు 4,000 మంది వాలంటీర్లతో నాసికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు లేవని గతంలోనే ప్రకటించింది. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. BBV-154 (ఇంట్రానాసల్) ఇమ్యునోజెనిసిటీ, భద్రతను.. కోవాక్సిన్‌తో పోల్చడానికి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి DCGI సంస్థ అనుమతిని మంజూరు చేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ ద్వారా ఇస్తే.. శరీరం కింద మాత్రమే రక్షిస్తుంది. అందుకే టీకాలు తీసుకున్నవారికి ఇప్పటికీ RT-PCR పాజిటివ్‌ను పొందే అవకాశం ఉంది. నాసికా జబ్ మొత్తం శరీరానికి రక్షణ ఇస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం