Bhadradri Talambralu : భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరీ, టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు-ఇలా నమోదు చేసుకోండి-bhadradri ramulori kalyana talambralu home delivery tgsrtc arrangements registration here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri Talambralu : భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరీ, టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు-ఇలా నమోదు చేసుకోండి

Bhadradri Talambralu : భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరీ, టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు-ఇలా నమోదు చేసుకోండి

Bhadradri Lord Rama Talambralu : భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే నేరుగా అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాద్రి వెళ్లలేని భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలు లేదా వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.inలో వివరాలను నమోదు చేసుకోవాలి.

భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరీ, టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు-ఇలా నమోదు చేసుకోండి

Bhadradri Lord Rama Talambralu : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను భ‌క్తుల ఇళ్లకు నేరుగా చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను హోండెలివ‌రీ చేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.

రూ.151 చెల్లిస్తే

రాములోరి త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోండెలివరీ చేస్తుంది.

ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు....భద్రాచలం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు రాములోరి కల్యాణం కన్నులారా చూసేందుకు భద్రాద్రి వెళ్తుంటారు. సీతారాముల కల్యాణం వీక్షించిన అనంతరం తలాంబ్రాలు ఇంటికి తెచ్చుకోవడం ఆనవాయితీ. అయితే భద్రాద్రి వెళ్లకపోయినా రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరరీ చేస్తుంది.

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు.

ఏప్రిల్ 6న శ్రీరామనవమి

భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంద‌ని సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-69440069, 040-69440000ను సంప్రదించాలని సూచించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం