Bhadradri News : భద్రాద్రి పోలీసుల ఆపరేషన్ చేయూత సక్సెస్, మావోయిస్టు లొంగుబాటు-bhadradri police operation cheyutha success maoist party committee member surrendered ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bhadradri Police Operation Cheyutha Success Maoist Party Committee Member Surrendered

Bhadradri News : భద్రాద్రి పోలీసుల ఆపరేషన్ చేయూత సక్సెస్, మావోయిస్టు లొంగుబాటు

HT Telugu Desk HT Telugu
Mar 20, 2024 07:26 PM IST

Bhadradri News : భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మడిది బుద్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మావోయిస్టు లొంగుబాటు
మావోయిస్టు లొంగుబాటు

Bhadradri News : తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ(Maoist Party) ఏరియా కమిటీ సభ్యుడు మడివి బుద్ర అలియాస్ కృష్ణ పోలీసుల(Police ఎదుట లొంగిపోయాడు. చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో మడివి బుద్ర బుధవారం లొంగిపోయాడు. మడవి బుద్ర అలియాస్ కృష్ణ 2010లో చర్ల-శబరి ఏరియా కమిటీలో చేరి 2015 వరకు దళ సభ్యునిగా పనిచేశాడు. 2015లో ఏరియా కమిటీ సభ్యునిగా ప్రమోషన్ పొంది తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ ప్రెస్ టీం బాధ్యతలను నిర్వహించాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులైన హరి భూషణ్, బండి ప్రకాష్, దామోదర్ వంటి అగ్రనాయకుల దగ్గర పనిచేస్తూ మావోయిస్టు పార్టీకి సంబంధించిన విప్లవ సాహిత్యాన్ని, ప్రెస్ నోట్లను, కరపత్రాలను తయారుచేస్తుండేవాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆపరేషన్ చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన "ఆపరేషన్ చేయూత"(Operation Cheyutha) కార్యక్రమంలో భాగంగా దుమ్ముగూడెం పోలీసులతో పాటు 141 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలకు ఆకర్షితుడై స్వచ్ఛందంగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. తెలంగాణ ప్రభుత్వం(TS Govt) తరపున ఇతనిపై 4 లక్షల రివార్డు ఉంది. కాగా మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక చాలా మంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసులు అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన “ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా కౌన్సిలింగ్ కు హాజరైన కుటుంబ సభ్యులు మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మడివి బుద్ర లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న దళ నాయకులు, దళ సభ్యులు గత కొంతకాలంగా పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చక సాధారణ జీవితం గడపడానికి లొంగిపోతున్నారు. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు, దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

వరుస లొంగుబాట్లుతో దిక్కుతోచని స్థితిలో మావోయిస్టు పార్టీ

వరుస లొంగుబాట్లు, అరెస్టులతో తెలంగాణలో మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిందని పోలీసులు తెలిపారు. అనేక మంది దళ సభ్యులు, దళ నాయకులు ముఖ్యంగా యువనాయకులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకుంటున్నారన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు వారి ఉనికి కాపాడుకోవడానికి చేస్తున్న చర్యలు, మావోయిస్టు పార్టీ వల్ల ఏజెన్సీ ప్రాంతానికి జరుగుతున్న నష్టం పట్ల విసుగు చెంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మావోయిస్టు పార్టీని విడిచి బయటకు రావడానికి సముఖంగా ఉన్నారన్నారు. కానీ మావోయిస్టు (Maoist)అగ్ర నాయకులు లొంగిపోవాలని నిర్ణయించుకున్న దళ సభ్యులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం, దళం నుంచి పారిపోయిన వారిని తిరిగి పట్టుకుని వేధించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

లొంగిపోయే దళసభ్యులకు పునరావాసం

లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని, స్వయంగా గాని తమ దగ్గరలోని పోలీసు స్టేషన్ లో లేదా జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరుపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషిచేస్తుందన్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం

IPL_Entry_Point