Cases Filed on Telugu Celebrities : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ నటులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ బారినపడి ఎంతో మంది అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ను కొంత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు డబ్బులు కోసం ప్రమోట్ చేస్తున్నారు. వీరిపై పోలీసుల దృష్టిసారించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తుడడంతో యువత వీటికి ఆకర్షితులు డబ్బులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు పెడుతున్నారు. సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పలువురి సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల #SayNoToBettingApps క్యాంపెయిన్ ప్రారంభించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జనార్ క్యాంపెయిన్ తో యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సజ్జనార్ పోరాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న వారి వీడియోలను పెడుతూ...వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.
"వీళ్లు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!? యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం