Actress Sowmya Janu : రాంగ్ రూట్ రచ్చ-పోలీసు విచారణకు హాజరైన నటి సౌమ్య జాను
Actress Sowmya Janu : రాంగ్ రూట్ లో వెళ్లి హోంగార్డుపై దాడి చేసి నటి సౌమ్య జాను ఇవాళ విచారణకు హాజరయ్యారు. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్ లో వెళ్లాలన్నారు.
Actress Sowmya Janu : ఇటీవల హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వచ్చి రచ్చ చేసిన నటి సౌమ్య జాను బుధవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన నటి సౌమ్య జానును(Actress Sowmya Janu) ఐదు గంటలపాటు విచారించారు. అనంతరం నోటీసు ఇచ్చి పంపించారు. గత నెల 24న బంజారాహిల్స్‌లో రాంగ్‌రూట్‌లో వచ్చిన నటి సౌమ్య జాను కారును హోంగార్డు అడ్డుకున్నారు. దీంతో హోంగార్డును(Traffic Home Guard) నోటికొచ్చినట్లు తిడుతూ... అతడి ఫోన్ ను లాక్కుని పగలగొట్టింది సౌమ్య జాను. హోంగార్డు ఫిర్యాదుతో నటి సౌమ్య జానుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంపై నటి హైకోర్టును ఆశ్రయించింది. ఆమెను అరెస్టు చేయకుండా కోర్టు స్టే ఇచ్చింది. మార్చి 11 లోపు పోలీసుల విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ సౌమ్య జాను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.
అసలేం జరిగింది?
ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి సమయంలో జాగ్వార్ కారులో రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న సౌమ్య జానును... విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు అడ్డుకున్నాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, వెనక్కి వెళ్లాలని కోరాడు. కారు ముందుకు వెళ్లకుండా కారుకు అడ్డుగా నిలిచాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన హీరోయిన్ సౌమ్య జాను...హోంగార్డుపై రెచ్చిపోయారు. 'నన్నే ఆపుతావా.. చేతకాని వాళ్లంతా డిపార్ట్‌మెంట్‌లో ఉంటారు' అంటూ దుర్భాషలాడారు. దీంతో పాటు ఈ ఘటనను వీడియో తీసున్న ఫోన్ ను నేలకేసి కొట్టారు. మరింత రెచ్చిపోయిన ఆమె హోంగార్డు జాకెట్‌ను చింపివేశారు. ఈ ఘటనపై హోంగార్డు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో నటి సౌమ్య జాను హోంగార్డుపై దాడి చేసిన వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉన్న పోలీసుపై ఇష్టానుసారం ప్రవర్తించిన హీరోయిన్ పై మండిపడ్డారు.
రాంగ్ రూట్ లో వెళ్లింది నిజమే
విచారణ అనంతరం నటి సౌమ్య జాను మీడియాతో మాట్లాడుతూ...తాను ఎవరిపై దాడి చేయలేదన్నారు. ఆ జరిగిన విషయం మొత్తం పోలీసులకు వివరించానన్నారు. మీడియా తనపై తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఆ రోజు రాంగ్ రూట్ లో వెళ్లింది నిజమేనని, తనది పొరపాటే అని ఒప్పుకున్నారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు వివరిస్తామన్నారు.
అర్జెంట్ పని ఉండడంతో
బంజారా హిల్స్‌లో(Banjara Hills) ట్రాఫిక్ హోం గార్డు మీద సినీ నటి సౌమ్య జాను ఇటీవల దాడి చేశారు. జాగ్వార్ కారు నడిపిన సినీ నటి సౌమ్య జాను(Actress Sowmya Janu)... రాంగ్ రూట్‌లో వచ్చి హోంగార్డును దూషించడంతో పాటు దాడి చేశారు. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్‌లో వెళ్లితే తప్పేంటి అని ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. తననే అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ప్రశ్నించారు. హోం గార్డు మీద నేను కూడా కేసు పెడతా అంటూ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం