Warangal Market : టన్ను రూ.1.22 లక్షలు...! ‘బంగినపల్లి’ మామిడికి రికార్డు ధర...!-banginapally mango gets record price for tonne at an auction held at the enamamula market in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Market : టన్ను రూ.1.22 లక్షలు...! ‘బంగినపల్లి’ మామిడికి రికార్డు ధర...!

Warangal Market : టన్ను రూ.1.22 లక్షలు...! ‘బంగినపల్లి’ మామిడికి రికార్డు ధర...!

Banginapally Mango Auction : వేసవి వేళ మామిడిపండ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే కోతకు వచ్చిన పంటకు మార్కెట్లకు తరలిస్తున్నారు. అయితే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్ పరిధిలో నిర్వహించిన వేలంలో బంగినపల్లి మామిడి రికార్డు ధర పలికింది. టన్ను మామిడికి రూ.1.22 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

బంగినపల్లి మామిడికి రికార్డ్ ధర

వేసవి వచ్చేసింది…! దీంతో తెలుగు రాష్ట్రాల్లో మామిడపండ్ల సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే కోతకు వచ్చిన పంటను… మార్కెట్లకు తరలిస్తున్నారు. పలుచోట్ల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇందులో బంగినపల్లి మామిడికి మంచి పేరు ఉంటుంది. మామిడిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ… బంగినపల్లికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.

రికార్డు ధర…!

స్థానికం నుంచి ప్రపంచం వరకు బంగినపల్లి మామిడిపండ్లు ఎగుమతి చేస్తుంటారు. అయితే గురువారం వరంగల్ లోని ఎనుమాముల ముసలమ్మకుంటలో నూతన మామిడి మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగినపల్లి మామిడి రికార్డ్ ధర పలికింది.

జిల్లా కలెక్టర్‌ తో పాటు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా మార్కెట్ లో నిర్వహించిన వేలంలో వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇందులో బంగినపల్లి మామిడికి టన్ను రూ.1.22 లక్షల వరకు పలికింది. ఈ సీజన్ లోనే కాదు మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలకటం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన విజయపాల్ రెడ్డి ఈ పంటను పండించాడు. మార్కెట్ వేలంలో రూ.1.22 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.