Bandi Sanjay : బీఆర్ఎస్‌లో క్రెడిబులిటి ఉన్న లీడర్ హరీష్ రావు.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bandi Sanjay : తెలంగాణలో పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, రేవంత్‌ను విమర్శించిన బండి.. హరీష్ రావును ఆకాశానికెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు.. చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలన్నారు. రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు తొంగి చూసే బుద్దిలే ఉన్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు.
'బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రేవంత్, నేను కొట్లాడాము. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. సమస్యను నేను డైవర్ట్ చేయడం లేదు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు లో కాంగ్రెస్ - బీఆర్ఎ,్ కాంప్రమైజ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులన్నీ హంగామా చేసి చివరకు కాంగ్రెస్ - బీఆర్ఎస్ నాయకులు కాంప్రమైజ్ అవుతున్నారు' అని బండి సంజయ్ ఆరోపించారు.
'బీజేపీకి స్పేస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ - కారు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తె వాళ్లు లీడర్ అవుతారా? బీఆర్ఎస్ ఇప్పుడు లేదు.. ఇక ముందు ఉండదు. ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్‌కు క్యాడర్ లేదు. కెపాసిటీ లేదు' అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.
'బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ రెస్ట్‌లో ఉన్నారు. కేసీఆర్ కొడుకు యాక్టింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. అభ్యర్థులు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. సర్పంచ్‌ల పొట్టగొట్టిందే బీఆర్ఎస్. మళ్లీ ఇప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్తున్నారు. సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసింది' అని బండి విమర్శించారు.
'బీఆర్ఎస్‌లో క్రిడిబులిటీ ఉన్న లీడర్ హరీష్ రావు. టీవీలో, ట్విట్టర్లో తప్ప కేటీఆర్ ఎక్కడ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను రేవంత్ ఒక్కటే అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి. గతంలో కేసీఆర్ గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇవ్వలేదు. గవర్నర్ ఖమ్మం వెళ్తానంటే కనీసం హెలికాప్టర్ ఇవ్వలేదు' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
'రేవంత్ గుర్తుపెట్టుకో! నీ బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు. నిన్ను జైలుకు పంపించారు. జైలుకు పంపించిన వారితో కాంప్రమైజ్ అవుతున్నారా? రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదు' అని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.