Bandi Sanjay: కరెంట్ ఛార్జీల పెంపునకు కేసీఆర్ నిర్ణయాలే కారణం-bandi sanjay counter to cm kcr comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: కరెంట్ ఛార్జీల పెంపునకు కేసీఆర్ నిర్ణయాలే కారణం

Bandi Sanjay: కరెంట్ ఛార్జీల పెంపునకు కేసీఆర్ నిర్ణయాలే కారణం

Mahendra Maheshwaram HT Telugu
Aug 20, 2022 10:15 PM IST

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. డిస్కంలు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని... ఇందుకు కేసీఆర్ సర్కార్ తీరే కారణమని విమర్శించారు.

<p>బండి సంజయ్ (ఫైల్ పొటో)</p>
బండి సంజయ్ (ఫైల్ పొటో)

bandi sanjay fires on kcr: తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జనగామ జిల్లా ఖిలాషపూర్ లో మాట్లాడిన ఆయన... ఎక్స్ఛేంజీలో విద్యుత్ విక్రయాలపై స్పందించారు. గతంలో విద్యుత్ ఉద్యోగుల జీతాలు ఫస్ట్ తారీకునే వచ్చేవి అని... కానీ ప్రస్తుతం 10వ తారీకు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. విద్యుత్ అధికారులు డిపార్ట్ మెంట్ నుంచి బయటకు రావాలని అనుకుంటున్నారని అన్నారు. ప్రణాళిక పద్ధతి లేకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర వెబ్ సైట్ లో రూ.1380 కోట్లు మాత్రమే బకాయి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని... మరో అధికారి రూ.50 కోట్లు మాత్రమే అని చెబుతున్నారని ఆక్షేపించారు. ఇంకొందరు అధికారులు అసలు బకాయిలే లేవని చెబుతున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపునకు కేసీఆర్ సిద్ధమైతున్నారని అన్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో ఏడాదికి రూ. 1000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలని... దాదాపు రూ.5వేల కోట్ల బకాయిలు పేరుకున్న పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు. డిస్కంలు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదని.. దీంతో పవర్ ఎక్సేంజిలో కరెంట్ కొంటున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ప్రజలపై భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.డిస్కంలకు టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.20వేల కోట్లు బాకీ ఉందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం