Warangal Crime : హన్మకొండలో దారుణం - నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య
హన్మకొండలో దారుణం జరిగింది. పట్టపగలే అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయగా… రాజ్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ నగరంలో దారుణం వెలుగు చూసింది. పట్టపగలే ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే మరో ఆటో డ్రైవర్.. కత్తితో దాడికి దిగాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించే సమయానికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
హన్మకొండలోని అదాలత్ జంక్షన్ సమీపంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై కత్తితో దాడికి దిగాడు. వరుస కత్తిపోట్లతో మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న సుబేదారీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్ ను మృతుడిగా గుర్తించారు. ఏనుగు వెంకటేశ్వర్లను నిందితుడిగా గుర్తించారు. వీరిమధ్య గొడవకు అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే గొడవకు వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది. పోలీసుల పూర్తిస్థాయి విచారణలో అసలు విషయాలు బయటికి రానున్నాయి.
సంబంధిత కథనం