Australia Hyderabad Woman Murder : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య, చెత్త డబ్బాలో మృతదేహం లభ్యం!-australia news in telugu hyderabad woman brutally murdered body found in dustbin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Australia Hyderabad Woman Murder : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య, చెత్త డబ్బాలో మృతదేహం లభ్యం!

Australia Hyderabad Woman Murder : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య, చెత్త డబ్బాలో మృతదేహం లభ్యం!

Bandaru Satyaprasad HT Telugu
Mar 10, 2024 03:10 PM IST

Australia Hyderabad Woman Murder : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె హత్య చేసి చెత్త డబ్బాలో పడేశారు. ఇటీవలె ఆమె భర్త కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు.

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

Australia Hyderabad Woman Murder : ఆస్ట్రేలియాలోని(Australia) ఓ జలపాతం వద్ద ఫొటోలు తీస్తూ జారిపడి వేమూరు ఉజ్వల అనే వైద్యురాలు మృతి (Telugu Doctor Died)చెందిన సగంతి తెలిసిందే. ఈ విషాద ఘటన మరువక ముందే ఆస్ట్రేలియా మరో ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. చెత్త కుప్పలో చైతన్య అనే మహిళ మృతదేహాన్ని(Australia Hyderabad Woman) పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బక్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవలే ఆమె భర్త అశోక్ హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో ఉంటున్నట్లు సమాచారం.

yearly horoscope entry point

చెత్త డబ్బాలో హైదరాబాద్ మహిళ మృతదేహం

ఆస్ట్రేలియా(Australia) విక్టోరియాలోని బక్లీలో రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో(Woman Body in Dustbin) ఆదివారం నాడు చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానిక విక్టోరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహిళను హత్య చేసి చెత్త డబ్బాలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్ట్రేలియాలని మిర్కా వే, పాయింట్ కుక్ లోని మహిళ నివాసంలో ఆమె హత్యకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. నేరస్థుడు విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల తన కుమారుడితో కలిసి ఇటీవలి హైదరాబాద్(Hyderabad) వచ్చినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి

ఆస్ట్రేలియాలో(Australia) లోయలో పడి తెలుగు వైద్యురాలు(Telugu Doctor) మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) మార్చి 2న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ హింటర్‌ ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ యాన్‌ బాకూచి జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా జారిపడి మరణించింది. ఉజ్వల గతేడాది గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌ చేశారు. జలపాతం వద్ద ఫొటోలు తీస్తున్న సమయంలో తన కెమెరా ట్రైపాడ్‌ను ఒక అంచుపై పడింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కాలు జారీ లోయ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఉజ్వల మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలకు పాటు శ్రమించారు.

ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు... వీరు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. వైద్యురాలు కావాలనేది ఉజ్వల చిన్ననాటి కల అని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. పీజీ పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యమని, కానీ ఇంతలో ఈ దుర్ఘటన జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న కూతురు ఇలా ఊహించని విధంగా దూరమవడం ఉజ్వల కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని కృష్ణా జిల్లా(Krishna District) ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి తరలిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం