BRS MP Vs MLA :బిఆర్‌ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే…చిచ్చు రేపిన ఫ్లెక్సీలు-audio clips of nagarkurnool brs mp and achhampet mla become viral in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Audio Clips Of Nagarkurnool Brs Mp And Achhampet Mla Become Viral In Telangana

BRS MP Vs MLA :బిఆర్‌ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే…చిచ్చు రేపిన ఫ్లెక్సీలు

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 08:42 AM IST

BRS MP Vs MLA బిఆర్‌ఎస్‌ ఎంపీ,ఎమ్మెల్యేల మధ్య ఫ్లెక్సీలు చిచ్చు పెట్టాయి. ఎంపీ కొడుకు నియోజక వర్గంలో ఫ్లెక్సీలు పెడుతుండటంతో ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. ఇది కాస్త ఒకరికొకరు సవాల్లు విసురుకునే వరకు వెళ్లింది. అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్‌ కర్నూల్ ఎంపీల మధ్య ఈ వివాదం తలెత్తింది.

నాగర్ కర్నూలులో నువ్వానేనా
నాగర్ కర్నూలులో నువ్వానేనా

BRS MP Vs MLA రాజకీయ ఆధిపత్యం కోసం బిఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములుకు హెచ్చరికలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఎంపీ కూడా ఘాటుగా ప్రతి స్పందించారు. ఇద్దరి సెల్‌ఫోన్‌ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

ట్రెండింగ్ వార్తలు

నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక ఇటీవల జరిగింది. ఈ పదవి ఆశించిన ఎంపీ కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌కు చివరి వరకు ప్రయత్నాలు చేసిన అది దక్కలేదు. తన కుమారుడికి పదవి దక్కకపోవడానికి ఎమ్మెల్యే బాలరజాు కారణమని ఎంపీ రాములు అనుమానించారు. ఈ నేపథ్యంలో రాములు, బాలరాజు మధ్య విభేదాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా భరత్‌ప్రసాద్‌ అచ్చంపేట కేంద్రంగా కార్యకర్తల సమీకరణ చేపడుతున్నారు.

నియోజక వర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెబుతూ బస్టాండ్‌ ప్రాంతంలో ఎంపీ రాములు, భరత్‌ప్రసాద్‌ల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌ను కొందరు చించేశారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. బాలరాజు అనుచరులే ఫ్లెక్సీలు చించేశారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న రాములు, బాలరాజుల మధ్య సెల్‌ఫోన్‌ సంభాషణ సాగింది.

అచ్చంపేటలో ఎంపీ ఫ్లెక్సీలు కాకుండా జడ్పీటీసీ సభ్యుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని, ఇష్టం వచ్చినట్లు చేస్తే మర్యాద ఉండదని, బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను ఉపయోగించాల్సి వస్తుందని బాలరాజు ఎంపీని హెచ్చరించారు. బాలరాజు వార్నింగ్ ఇవ్వడంతో నీ బెదిరింపులు నా వద్ద పనికిరావంటూ ఎంపీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్యే గువ్వల ఘాటుగా స్పందించారు. తన సంభాషణ రికార్డు చేసుకుని ఎవరికైనా చెప్పుకోవాలని సూచించాచరు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎంపీ కుమారుడు ఇప్పటి నుంచే ఫ్లెక్సీలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడని బాలరాజు నిలదీశారు. ఎంపీ వైఖరిపై అనుమానంతో ఉన్న బాలరాజు తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాలరాజు స్పందించలేదు. మరోవైపు ఎంపీ రాములు స్పందించారు. తనను బెదిరిస్తూ బాలరాజు చేసిన ఫోన్‌ సంభాషణ, జిల్లాలో ఎమ్మెల్యే వైఖరిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

IPL_Entry_Point