Moinabad Crime : మొయినాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారయత్నం-attempted rape of a four year old child in moinabad of rangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Moinabad Crime : మొయినాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారయత్నం

Moinabad Crime : మొయినాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారయత్నం

Basani Shiva Kumar HT Telugu
Jan 03, 2025 12:51 PM IST

Moinabad Crime : అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి.. తన ఇంటి ముందు ఆడుకుంటోంది. అప్పుడే అటుగా వచ్చిన ఓ తాగుబోతు కన్ను ఆ పసిపాపపై పడింది. ఆ చిన్నారిని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెల్లిన కామాంధుడు.. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని స్థానికులు చితకబాదారు.

నిందితుడు కైలాస్
నిందితుడు కైలాస్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా థరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం.. బతుకుదెరువు కోసం కొద్ది నెలల కిందట మొయినాబాద్‌కు వలస వచ్చింది.

yearly horoscope entry point

పొదల్లోకి లాక్కెళ్లి..

ఆ కుటుంబం మొయినాబాద్ పెద్ద మంగళారంలోని ఓ విధిలో అద్దెకు ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె (4) గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన కైలాస్ (40) ఆ సమయంలో అటుగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కైలాస్.. ఆ బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

గమనించిన అక్క..

ఇది గమనించిన బాధితురాలి అక్క.. వెంటనే వెళ్లి తన నాన్నకు జరిగిన విషయం చెప్పింది. ఆ తండ్రి వెంటనే వెళ్లి కైలాస్‌ను పట్టుకున్నాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు.. కైలాస్‌ను చితకబాదారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబం ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపారి ఆత్మహత్య..

హైదరాబాద్ గండిపేటలో గురువారం ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.64 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ.. ఆ శాఖ అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు.. కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వామి ఆరోపించారు. సేమ్ జీఎస్టీ నంబరుతో మరొకరు ఇతర వ్యాపార లావాదేవీలు చేశారని, అందుకు సంబంధించి భారీగా పన్ను కట్టాల్సి రావడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

కొకైన్‌ స్వాధీనం..

న్యూఇయర్ వేడుకల్లో కొకైన్‌ అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన జహవర్‌ కిషన్‌ గోపాల్‌.. ప్లాస్టిక్‌ వ్యాపారంలో నష్టపోయాడు. స్నేహితులు అనీల్, వరుణ్, ప్రమోద్‌ సూచనతో మాదక ద్రవ్యాలను తెచ్చి విక్రయించాలనుకున్నాడు. ముంబయికివెళ్లి ఓ నైజీరియన్‌ నుంచి డ్రగ్స్‌ కొని తీసుకొచ్చాడు. కొకైన్‌ విక్రయించే ప్రయత్నంలో ఉండగా.. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.8 లక్షల విలువైన కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసున్నారు.

Whats_app_banner