ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, ప్రభుత్వ పాఠశాల నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండుగులు-atrocity in adilabad district miscreants mixed pesticide in water tank of government school ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, ప్రభుత్వ పాఠశాల నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండుగులు

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, ప్రభుత్వ పాఠశాల నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండుగులు

HT Telugu Desk HT Telugu

ఆదిలాబాద్ జిల్లా ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలోని వాటర్ ట్యాంక్ లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. పాఠశాలకు మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులకు ఈ నీటిని తాగలేదు దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం, ప్రభుత్వ పాఠశాల నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండుగులు

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడా మండలంలో ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాగునీటిలో పురుగుమందు కలిపిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు హాని కలిగించేందుకు దుండగులు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాఠశాల సెలవుల దృష్ట్యా మూడు రోజుల పాటు మూసివుండటంతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయురాలు ప్రతిభ తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల బోధన సిబ్బంది ఒక తరగతి గదిలో ఖాళీ పురుగుమందు సీసాలను గమనించారు. వెంటనే వారు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్, గ్రామస్తులకు తెలియజేశారు. వారంతా కలిసి విద్యార్థుల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

పోలీసులు పాఠశాలని పరిశీలించి, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నీటిలో విషాన్ని కలిపినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.

రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk

సంబంధిత కథనం