తెలుగు న్యూస్ / తెలంగాణ /
Arunachalam Tour 2025 : హైదరాబాద్ టు అరుణాచలం - ఈ నెలలోనే ట్రిప్, ఈ టూర్ ప్యాకేజీ చూడండి..!
ఈ న్యూ ఇయర్ వేళ అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ జనవరి 10, 2025వ తేదీన అందుబాటులో ఉంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
అరుణాచలం ఆలయం (image source Twitter)
ఈ నూతన సంవత్సరంలో అరుణాచలేశ్వరుడి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా..? అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్సైట్ లోకి వెళ్లి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు :
- హైదరాబాద్ నుంచి అరుణాచలానికి తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
- "HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- జనవరి 10, 2025వ తేదీన జర్నీ ఉంటుంది. ముందుస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాల కోసం టూరిజం వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.
- మొత్తం 4 రోజుల టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు.
- మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
- రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాల్గో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
- హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 8000, చిన్నారులకు రూ. 6400.
- టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు
- హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=342&journeyDate=2025-01-10&adults=2&childs=0
మరోవైపు అరకుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం