Arunachalam Tour Package : కార్తీక మాసం వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!-arunachalam tour package announced by telangana tourism for november month 2024 details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Arunachalam Tour Package : కార్తీక మాసం వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

Arunachalam Tour Package : కార్తీక మాసం వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 01, 2024 02:48 PM IST

కార్తీక మాసం వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ ఆపరేట్ చేస్తోంది. నాలుగు రోజులు ట్రిప్ ఉంటుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుకింగ్ విధానం, ధరల వివరాలు ఇక్కడ చూడండి….

అరుణాచలం
అరుణాచలం (image source @tntourismoffcl X Account)

దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అరుణాచలం ఒకటి. దీనిన్ని తమిళనాడులో అన్నామలై అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు. అందుకే ఆ కొండ చుట్టు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు.

ఆశ్వయుజ, కార్తీక మాసాల్లోని పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని అంటుంటారు. కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు అధ్యాత్మిక కేంద్రాలకు భక్తులు భారీగా తరలివెళ్తుంటారు. అయితే అరుణాచళేశ్వరుడి దర్శనం కోసం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు బయల్దేరుతుంటారు.

తెలంగాణ టూరిజం ప్యాకేజీ - 13వ తేదీన జర్నీ

కార్తీక మాసం వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు ట్రిప్ ఉంటుంది.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ఈ నవంబర్ నెలలో చూస్తే 13వ తేదీన జర్నీ ఉంది. https://tourism.telangana.gov.in/toursList? వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

4 రోజుల టూర్ షెడ్యూల్ :

  • ఫస్ట్ డే సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
  • మూడో రోజు ఉదయం అల్పహారం చేసిన తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
  • నాల్గో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

బుకింగ్ విధానం, ధరల వివరాలు:

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 8000గా ఉంది. చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే పేమెంట్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం