TS Polycet: తెలంగాణ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ రేపే..ఏర్పాట్లు పూర్తి-arrangements are complete for the conduct of polytechnic entrance examination in telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Arrangements Are Complete For The Conduct Of Polytechnic Entrance Examination In Telangana

TS Polycet: తెలంగాణ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ రేపే..ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్‌ 2023
పాలిసెట్‌ 2023

TS Polycet: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

TS Polycet: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2023 ప్రవేశపరీక్ష బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,05,656 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. వీరిలో అమ్మాయిలు 47,188 మంది ఉండగా, అబ్బాయిలు 58,468 మంది ఉన్నారు. పాలిసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు.

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.

నిమిషం నిబంధన అమలు..

పాలిసెట్​కు అధికారులు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 11 గంటల తర్వాత ఎవరినీ అనుమతించబోమని పాలిసెట్ 2023 కన్వీనర్ శ్రీనాథ్ చెప్పారు. హాల్ టికెట్ మీద ఫొటో ఫ్రింట్ కాని వారు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.

అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్​బీటీఈటీ టీఎస్ అప్లికేషన్‌ డౌన్​లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలను సులువుగా తెలుసుకోవచ్చు. పరీక్ష కేంద్రం లొకేషన్ పై పాలిసెట్ సెంటర్ లొకేటర్ టాబ్​ను ఓపెన్ ​చేసి, అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్​ చేయాలి. విద్యార్ధులకు పరీక్ష కేంద్రం కోడ్, స్టూడెండ్ పేరు, సెంటర్ అడ్రస్​ కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని ఈజీగా గుర్తించవచ్చని అధికారులు వివరించారు.