TG Arogyasri Dues: తెలంగాణలో జనవరి 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. ప్రైవేట్ ఆస్పత్రుల వార్నింగ్-arogya sri services to be closed in telangana from january 10 private hospitals warned ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Arogyasri Dues: తెలంగాణలో జనవరి 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. ప్రైవేట్ ఆస్పత్రుల వార్నింగ్

TG Arogyasri Dues: తెలంగాణలో జనవరి 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. ప్రైవేట్ ఆస్పత్రుల వార్నింగ్

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 10:51 AM IST

TG Arogyasri Dues: బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చి చెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడంతో జనవరి 10లోగా బకాయిలు విడుదల చేయకపోతే సేవల్ని నిలిపివేస్తామని ఆస్పత్రులు ప్రకటించాయి.

తెలంగాణలో ఆరోగ్య శ్రీ నిలిపివేస్తామని నెట్కర్క్‌ ఆస్పత్రుల వార్నింగ్
తెలంగాణలో ఆరోగ్య శ్రీ నిలిపివేస్తామని నెట్కర్క్‌ ఆస్పత్రుల వార్నింగ్

TG Arogyasri Dues: తెలంగాణలో జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత ఏడాది కాలంగా ప్రభుత్వం ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నామని చెబుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించక పోతే జనవరి 10వ తేదీనుంచి వైద్య సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి.

yearly horoscope entry point

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఇవోకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది నుంచి బకాయిలు చెల్లించడం లేదని, జనవరి 10లోగా పెండింగ్ బకా యిలను విడుదల చేయాలని, బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్స త్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను జనవరి 10 నుంచి నిలిపి వేస్తామని హెచ్చరించాయి.

ఆరోగ్యశ్రీతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (జేహె చ్ఎస్)లలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయని తెలిపాయి. పెండింగ్ బకాయిల వల్ల ఆస్పత్రులు ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ఆసోసియేషన్ (తానా) పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యశ్రీ సేవ లను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని తానా చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 9 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, బీఆర్ఎస్ హయంలో రూ.672 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉండగా కాంగ్రెస్‌ వచ్చాక అది మరింత పెరిగిందని చెబుతున్నారు.

గతంలో మొదట బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు (ఫస్ట్ క్లెయిమ్, ఫస్ట్ పేమెంట్) తరహా పద్దతి ఉండేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల చెల్లింపులు రెండు నెలలకోసారి కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్నారని, ఫలితంగా బకాయిలు భారీగా పేరుకు పోయాయని చెబుతున్నాయి.

తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం ఆరోగ్య శ్రీ చికిత్సలకు గత ఏడాది కాలంలో దాదాపు రూ.820 కోట్లను విడుదల చేసినట్టు చెబుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న బిల్లులు రూ. 672 కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని, వాటిని క్లియర్ చేయడంతో పాటు కొత్త వాటిని మంజూరు చేస్తున్నామన్నారు. మరోవైపు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆస్పత్రులు నడిపే పరిస్థితి లేదని తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం మాత్రం గత వారం కూడా రూ.40కోట్ల విడుదలైందని, ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.400కోట్లకు మించి ఉండవని చెబుతోంది.

Whats_app_banner