APPSC Job Notification : ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే-appsc notification for the recruitment of assistant environmental engineers posts under the pollution control board ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Job Notification : ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

APPSC Job Notification : ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

AP Pollution Control Board Jobs : ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్

AP Pollution Control Board Jobs: ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలతో పాటు లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇవ్వగా… తాాజాగా మరో నోటిఫికేషన్ ను జారీ చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఉద్యోగాలు - ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్

మొత్తం ఖాళీలు - 21

అర్హతలు - బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌/మెకానికల్‌/కెమికల్‌/ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు - 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - జనవరి, 30, 2024.

దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 19, 2024.

దరఖాస్తు రుసుం -అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం - రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటాయి.

జీతం - నెలకు రూ.57,100 - రూ.1,47,760 ఇస్తారు.

రాతపరీక్ష తేదీ- ఏప్రిల్/ మే, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://psc.ap.gov.in/

అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్, పరీక్షా విధానం, అర్హతలు, సిలబస్ కోసం కింద ఇచ్చిన పీడీఎఫ్ చూడండి….

మరోవైపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది ఏపీపీఎస్సీ. మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి....

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఉద్యోగాలు - డిగ్రీ లెక్చరర్

మొత్తం ఖాళీలు - 240

సబ్జెక్టులు - 11(వృక్షశాస్త్రం, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకామనిక్స్, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ).

అర్హత - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. సెట్, నెట్ వంటి అర్హత పరీక్షలు పాస్ కావాలి. ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - 24, జనవరి 2024.

ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 13, ఫిబ్రవరి 2024.

ఎగ్జామ్ తేదీ - ఏప్రిల్/ మే, 2024.

ఎగ్జామ్ విధానం - ఆబ్జెక్టివ్‌ విధానంలో 2 పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్‌–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయి.

అధికారిక వెబ్ సైట్ - https://psc.ap.gov.in/

సంబంధిత కథనం