Apprentice Notification: హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రంటీస్, 300 ఖాళీలు, దరఖాస్తు చేయండి ఇలా..
Apprentice Notification: కేంద్ర ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో నడిచే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రంటీస్‌లకు నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులకు అప్రంటీస్‌లో భాగస్వామ్యం కల్పిస్తారు.
Apprentice Notification: హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఐటీఐ అభ్యర్థులకు అప్రంటీస్ అందించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 300ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా శిక్షణ కల్పిస్తారు. శిక్షణా కాలంలో రూ.8050 భృతిని అందిస్తారు. పదవ తరగతి తర్వాత ఐటీఐలో పాస్ అయిన అభ్యర్థులు అప్రంటీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 300ఖాళీలు...
అప్రంటీస్‌లో భాగంగా ఐటీఐ ఫిట్టర్ ఖాళీలు 95, టర్నర్ 22, ఎలక్ట్రిషియన్ 30, మెషినిస్ట్ 17, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 7, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్స్ 11,ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 18, లేబొరేటరీ అసిస్టెంట్ 10, మోటర్ మెకానిక్స్ 3 అప్రంటీస్ డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్ 2 ఖాళీలు ఉన్నాయి.
కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అసిస్టెంట్, 47, డీజిల్ మెకానిక్ 4, కార్పెంటర్ 4, ప్లంబర్ 4, వెల్డర్ 24, స్టెనోగ్రాఫర్ 2 పోస్టులు భర్తీ చేస్తారు. చివరి ఆరు క్యాటగిరీలకుప్రతి నెల రూ.7700 వేతనం చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని న్యూ క్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ కోడ్ E11153600013కు దరఖాస్తు చేయాల్సి ఉటుంది.
దరఖాస్తు గడువు..
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 25గా పేర్కొన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్రంటీస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలక్ట్రిషియన్ మినహా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఇది పూర్తిగా అప్రంటీస్ కోసమే నిర్దేశించిన కార్యక్రమం.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18ఏళ్ల వయసు పూర్తై ఉండాలి. గరిష్టంగా 25ఏళ్ల వయసు, ఓబీసీ అభ్యర్థులకు 28ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకు 30ఏళ్ల వరకు అనుమతిస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు నేషనల్ అప్రంటీస్ ప్రమోషన్ స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు ఉన్న వారిని ఈ అప్రంటీస్‌కు అనుమతించరు.
ఈ పత్రాలు అవసరం..
ఎంపికైన అభ్యర్థులకు క్వార్టర్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఆధార్ కార్డులు చిరునామా ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు తమతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ధృవీకరణ కోసం తీసుకురావాల్సి ఉంటుంది.
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జిల్లా ఎస్పీ, కమిషనర్ నుంచి పొందాల్సి ఉంటుంది. పది, ఐటీఐ, విద్యార్హత పత్రాలతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, సేవింగ్స్ అకౌంట్ పాస్ బుక్, ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్‌కాపీ, జిరాక్స్ పత్రాలు, 2 పాస్ పోర్ట్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. అప్రంటీస్ ఏడాది పాటు ఉంటుంది.
అటామిక్ ఎనర్జీ అనుబంధ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అప్రంటీస్ కోసం ఈ లింకును అనుసరించండి…