TG Ration Cards: మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, గతంలో దరఖాస్తు చేసిన వారికి మినహాయింపు-applications for ration cards at mee seva centres have started exemptions for those who have applied in the past ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ration Cards: మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, గతంలో దరఖాస్తు చేసిన వారికి మినహాయింపు

TG Ration Cards: మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, గతంలో దరఖాస్తు చేసిన వారికి మినహాయింపు

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 11, 2025 08:42 AM IST

TG Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతంలో ప్రజావాణిలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మిన‍హాయింపు ఇచ్చారు. సోమవారం నుంచి తెలంగాణలో రేషన్‌ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ

TG Ration Cards: తెలంగాణలో మళ్లీ రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే పలు విడతలుగా దరఖాస్తులుగా స్వీకరించిన కొత్త కార్డులు మాత్రం జారీ కాలేదు. తాజాగా మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

రేషన్ కార్డుల జారీ విషయంలో గందరగోళం నెలకొనడంతో సివిల్ సప్లైస్ శాఖ దరఖాస్తుల విషయంలో అధికారికంగా స్ఫష్టత ఇచ్చింది. కొత్త దరఖాస్తులు స్వీక రించడానికి మీసేవ ఆధికారులతో చర్చించి నిర్ణయించారు. వెబ్‌సైట్‌లో ' దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ పునరుద్ధరించారు. మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం మొదలైంది.

రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు చేసే విషయంలో గందరగోళం జనం అవస్థలు పడ్డారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిం చేందుకు మీ-సేవ వెబ్‌సైట్‌లో ఆప్షన్ అందు బాటులో ఉంచాలని సివిల్ సప్లైస్‌ శాఖ ఫిబ్రవరి 7వ తేదీన మీసేవ అధికారులకు సమాచారం అందించింది. అదే రోజు రాత్రి నుంచి ఆప్షన్‌ కనిపించినా 8వతేదీ ఉదయం నుంచి మాయమైంది. గత నాలుగు రోజులుగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేయడానికి వస్తున్న వారు తిరిగి వెళుతున్నారు.

మీ సేవా అధికారులతో జరిగిన చర్చలో ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించడంపై చర్చించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ అధికారుల్ని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదే శించారు. సోమవారం సాయంత్రం నుంచి దరఖా స్తుల స్వీకరణను మీసేన నిర్వాహకులు ప్రారంభించారు.

రేషన్ కార్డుల కోసం ప్రజా పాలన/ కుల గణన/ ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నందున మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సివిల్ సప్లైస్ శాఖ స్పష్టత ఇచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. సోమవారం నుంచి మీసేవ పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరిస్తు న్నారు. రేషన్ కార్డులలో పేర్ల నమోదు, కొత్త కార్డుల దరఖాస్తులకు అవకాశం కల్పి స్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

  • మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా పూరించి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులతో పాటు ప్రస్తుతం నివాసముంటున్న విద్యుత్తు బిల్లు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులను స్కాన్ చేయిస్తే సరిపోతుంది.
  • రేషన్ కార్డు దరఖాస్తు కోసం రూ.50 మాత్రమే స్వీకరించాలని మీసేవలను పర్యవేక్షించే ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మీసేవ కేంద్రాలు అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరింది.

Whats_app_banner