Overseas Scholarships : రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం.. విదేశీ విద్యానిధికి నేటి నుంచే దరఖాస్తులు - చివరి తేదీ ఎప్పుడంటే
Telangana Overseas Scholarships : విదేశీ విద్యానిధి స్కీమ్ దరఖాస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 14వ తేదీ నుంచి ఎస్సీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అక్టోబరు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం ఇవాళ్టి(ఆగస్టు 14) నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది.
- ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థి సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలోపు మాత్రమే ఉండాలి.
- ఈ స్కీమ్ లో భాగంగా అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లొచ్చు.
- ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ. 20 లక్షల వరకు ఉపకార వేతనం పొందవచ్చు.
- కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
- గ్రాడ్యూయేషన్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. GRE/GMAT లో అర్హత స్కోర్ ఉండాలి.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్‌ఈ, జి మ్యాట్ స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిథి పధకంలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పిటిఇలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఎంపికలో స్కోర్ పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల్లోఅడ్మిషన్ పొందే యూనివర్శిటీల్లో స్కోర్ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.
కావాల్సిన పత్రాలివే:
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయపత్రం(ఇన్ కామ్ సర్టిఫికెట్)
- పుట్టిన తేదీ ధ్రువపత్రం
- ఆధార్ కార్డు
- ఈ- పాస్ ఐడీ నెంబర్
- ఇంటి నెంబర్ వివరాలు
- పాస్ పోర్టు కాపీ
- పది, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల మెమోలు
- • GRE /GMAT స్కోర్ కార్డు
- • TOFEL / IELTS స్కోర్ కార్డు
- అడ్మిషన్ ఆఫర్ లెటర్ (ఫారెన్ యూనివర్శిటీ నుంచి)
- బ్యాంక్ వివరాలు
- ఫొటో
టాపిక్