Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం, మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్-ap ts rains weather update heavy rain lashes hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం, మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం, మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

Published Jul 08, 2023 08:19 PM IST Bandaru Satyaprasad
Published Jul 08, 2023 08:19 PM IST

  • Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో శని, ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోందని ప్రకటించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సోమాజిగూడ, చందానగర్, అమీర్ పేట్ తో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో  వర్షం పడుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​అయింది. వర్షానికి సంబంధించి జీహెచ్​ఎంసీ అధికారులు నగరవాసుల ఫోన్లకు మెసేజ్ ల ద్వారా అలర్ట్స్ పంపారు.  

(1 / 7)

(unsplash)

సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ వాసులు అత్యవసర సమయంలో సహాయం కోసం 9000113667కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది.  

(2 / 7)

రానున్న 2 గంటల్లో హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

(3 / 7)

హైదరాబాద్ లో మేఘావృతమైన ఆకాశం, పలు ప్రాంతాల్లో భారీ వర్షం

(4 / 7)

హైదరాబాద్ లో మేఘావృతమైన ఆకాశం, పలు ప్రాంతాల్లో భారీ వర్షం

తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

(5 / 7)

నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా... మరికొన్నిచోట్ల మోస్తారుగా పడుతున్నాయి. 

(6 / 7)

ఏపీకి మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర, మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దీని ఫలితంగా వచ్చే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు పడుతాయని తెలిపింది.   

(7 / 7)

ఇతర గ్యాలరీలు