RTC Buses Trains Cancelled : భారీ వర్షాల ఎఫెక్ట్- 481 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు-ap telangana heavy rains effect 1400 tsrtc buses scr 432 trains cancelled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rtc Buses Trains Cancelled : భారీ వర్షాల ఎఫెక్ట్- 481 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు

RTC Buses Trains Cancelled : భారీ వర్షాల ఎఫెక్ట్- 481 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు

Bandaru Satyaprasad HT Telugu
Sep 02, 2024 05:14 PM IST

RTC Buses Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకూ 1400 ఆర్టీసీ బస్సులు, 481 రైళ్లు రద్దయ్యాయి.

భారీ వర్షాల ఎఫెక్ట్- 432 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు
భారీ వర్షాల ఎఫెక్ట్- 432 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు

RTC Buses Trains Cancelled : కుండపోత వర్షాలు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేశాయి. ఎక్కడ చూసినా నడుము లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులపై వరద నీరు చేరి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలకు రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోవడంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 481 రైళ్లు రద్దయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సుమారు 1400 బస్సులు రద్దు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.

1400 బస్సులు రద్దు

ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ పలు మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అలాగే విజయవాడ వెళ్లే పలు ఆర్టీసీ బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం మరో 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేశారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. వరదలతో వికారాబాద్‌లో 212 బస్సులకు గానూ 50 మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

432 రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇప్పటి వరకు 481 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు 152 రైళ్లు దారి మళ్లించినట్లు, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, పాసింజర్ ఉన్నాయి.

ఇంటికన్నె-కేసముద్రం మధ్య కొట్టుకుపోయిన ట్రాక్

కేసముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ శనివారం రాత్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మరమ్మతు పనులు చేపట్టారు. ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్‌, కంకర తరలిస్తుననారు. 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో ట్రాక్ మరమ్మత్తు పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం మేరకు పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలిస్తే ఇవాళ ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను అనుమతిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

భారీ వర్షాలు కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

రద్దైన రైళ్ల వివరాలు

  • 17233 -సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ -02.09.24
  • 17234-సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్ -03.09.24
  • 12774 -సికింద్రాబాద్ టు షాలిమార్ -03.09.24
  • 12773 -షాలిమార్ టు సికింద్రాబాద్ -04.09.24
  • 22204 -సికింద్రాబాద్ టు విశాఖపట్నం -02.09.24
  • 12864 -SMVT బెంగళూరు టు హౌరా -03.09.24
  • 17487 - కడప టు విశాఖపట్నం -02.09.24
  • 17409 - ఆదిలాబాద్ టు నాందేడ్ -02.09.24
  • 17410 - నాందేడ్ టు ఆదిలాబాద్ -02.09.24
  • 12805 -విశాఖపట్నం టు సికింద్రాబాద్ -02.09.24
  • 18463 - భువనేశ్వర్ టు KSR బెంగళూరు -02.09.24
  • 22701 -విశాఖపట్నం టు గుంటూరు -02.09.24
  • 20707-సికింద్రాబాద్ టు విశాఖపట్నం -03.09.24
  • 20708 -విశాఖపట్నం టు సికింద్రాబాద్ -03.09.24
  • 20833 -విశాఖపట్నం టు సికింద్రాబాద్ -03.09.24
  • 20834 -సికింద్రాబాద్ టు విశాఖపట్నం -03.09.24

సంబంధిత కథనం