ఏపీ,తెలంగాణలో వర్షాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం.... ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. రేపు, ఎల్లుండి మాత్రం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో చూస్తే.... ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. రేపు, ఎల్లుండి మాత్రం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 - 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం లేదని వివరించింది.
రాయలసీమలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.
తెలంగాణలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి వర్ష సూచన ఉండగా... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల వడగళ్లు కూడా పడుతాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను ఇచ్చారు.
మార్చి 22వ తేదీన కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు…. మరోవైపు వర్ష సూచన ఉండటంతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం