Vajedu SI Suicide Case : వాజేడు ఎస్సై సూసైడ్ కేసు.. ఆ మూడో వ్యక్తి ఎవరు? 8 ముఖ్యమైన అంశాలు
Vajedu SI Suicide Case : వాజేడు ఎస్సై సూసైడ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. కానీ.. ఇంకా కొలిక్కి రాలేదు. హరీష్ ఆత్మహత్యకు కారణాలు ఏంటని ఇంకా తేల్చలేదు. అయితే తాజాగా ఓ వ్యక్తి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ సూసైడ్ ఇష్యూ.. తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. హరీష్ సూసైడ్ చేసుకొని వారం దాటినా.. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే.. పోలీసుల దర్యాప్తులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో వ్యక్తి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.హరీష్ ఆత్మహత్య కేసులో ప్రధాన అనుమానితురాలిగా ఉన్న సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతిని.. పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.
2.ఎస్సై ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి యువతితో పాటు మరో వ్యక్తి అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
3 ఆ వ్యక్తి.ఎస్సై హరీష్ స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే.. ఆయన అక్కడ ఎంత సమయం గడిపారు? ఎప్పుడు వచ్చారు? వారు ముగ్గురూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
4 డిసెంబర్.1న రాత్రి 7 గంటల సమయంలో ఆ వ్యక్తి రిసార్టుకు వచ్చి.. ఎస్సై హరీష్, ఆ యువతితో మాట్లాడారని తెలుస్తోంది.
5.ఎస్సై హరీష్‌కు పెళ్లి నిశ్చయం అయిందని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరికీ నచ్చచెప్పినట్లు సమచారం.
6.ఆ ఇద్దరితో మాట్లాడిన కూడా.. యువతి ఒప్పుకోలేదని.. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్సై స్నేహితుడు బయటకు వెళ్లిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది.
7.పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలని ఎస్సైని యువతి డిమాండ్ చేసిందని.. అందుకు హరీష్ ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన కొందరితో ఎస్సైకి కాల్ చేయించి బెదిరించారనే ప్రచారం జరుగుతోంది.
8.ఈ కేసు గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అయినా.. పోలీసులు మాత్రం వివరాలు వెల్లడించడం లేదు. అయితే.. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని.. ఓ పోలీస్ అధికారి చెప్పారు.