SLBC Dead body: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచి కెనాల్‌లో మరో మృతదేహాన్ని గుర్తించారు. సొరంగం పై భాగం కూలిన తర్వాత 16వ రోజు పంజాబ్‌కు చెందిన టిబిఎం ఆపరేటర్ మృతదేహాన్ని గుర్తించారు. తాజాగా టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తించారు. బురదలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
ఎస్‌ఎల్‌బిసిలో సహాయ చర్యల్ని కొనసాగించడంపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో మృతదేహం కనిపించింది. టన్నెల్ కూలిన సమయంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో ఒక్కరి మృతదేహం మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. మంగళవారం రాత్రి మినీ హిటాచీతో మట్టి తవ్వి తీస్తుండగా... మృతదేహం లభ్యమైనట్టు సహాయ బృందాలు వెల్లడించాయి.
కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహాన్ని జాగ్రత్తా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు బయటపడగా మరో ఆరుగురి ఆచూకి తెలియాల్సి ఉంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ కొనసాగుతోంది. 32వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో ఆరుగురి మృతదేహాల కోసం తవ్వకాలు కొనసాగించడంపై సందిగ్దత నెలకొంది. టన్నెల్‌లో చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.
వాటర్ లీకేజీలతో టన్నెల్ పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. టిబిఎం ప్రయాణిస్తున్న మార్గంలో కాకుండా బైపాస్ నిర్మించాలనే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నారు. ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ను డిజైన్ చేసిన మార్గంలో కాకుండా బైపాస్‌లో కలపాలని, దీనికి మూడేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం