September06 Telugu News Updates : ఈ నెల 12, 13న శాసనసభ సమావేశాలు.. బీఏసీ భేటీలో నిర్ణయం
- తెలంగాణ శాసన సభా సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి సమావేవాలను ఉదయం 11.30కు ప్రారంభిస్తారు.దాదాపు ఆర్నెల్ల తర్వాత శాసనసభా సమావేశాలు జరుగుతుండటంతో అధికార, విపక్షాలు సమావేశాలపై దృష్టి సారించాయి. తొలిరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండదు.
Tue, 06 Sep 202205:13 PM IST
దిల్లీలో మరో భారీ డ్రగ్ రాకెట్
దిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. సుమారు.. 322.5 కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. 10కేజీల హెరాయిన్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా. ఈ దందాను విదేశీయులు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Tue, 06 Sep 202205:09 PM IST
మరో వెయ్యి కోట్లు వడ్డీ తీసుకున్న ఏపీ
రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలంతో ఏపీ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకున్నది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను వేలం వేసి, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం తీసుకుంది. 7.58 శాతం వడ్డీ చెల్లించనుంది.
Tue, 06 Sep 202203:29 PM IST
ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది
ఇంట్లో ఉన్న ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనేది నెల్లూరు ఘటనతో మరోసారి రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కావన్నారు. వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు.
Tue, 06 Sep 202202:02 PM IST
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లుధియానాకు చెందిన ఓ కుటుంబం చండీగఢ్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుంది. ఫోకల్ పాయింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకింది. కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Tue, 06 Sep 202201:33 PM IST
ముప్పాళ్ళ సచివాలయంలో యువకుడి వీరంగం
ముప్పాళ్ళ సచివాలయంలో యువకుడి వీరంగం సృష్టించారు. సచివాలయంలో రెండు కంప్యూటర్స్, ప్రింటర్ ధ్వంసం చేశాడు. సిబ్బందిపై దౌర్జన్యం చేసి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లాడు యువకుడు కోటిరెడ్డి. స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించాడు. ముప్పాళ్ళ వార్డు మెంబర్ కొడుకే కోటిరెడ్డి అని తెలుస్తోంది. సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో కోటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Tue, 06 Sep 202211:49 AM IST
మన కడప అనే పేరుతో యాత్రా
కడప జిల్లా వాసులకు "మన కడప " అనే పేరిట యాత్రా సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు ప్రముఖ ప్రాంతాల సందర్శన చేయించనున్నారు. మన కడప పేరుతో ప్రాచీన ప్రదేశాల సందర్శన కార్యక్రమానికి ఈ నెల 10వ తేది నుండి శ్రీకారం చుట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, 06 Sep 202210:16 AM IST
భాగ్యనగరంలో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలోని ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లో వర్షం పడింది. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Tue, 06 Sep 202209:10 AM IST
ఈ నెల 12, 13న శాసనసభ సమావేశాలు.. బీఏసీ భేటీలో నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు మెుదలయ్యాయి. ఇటీవల మరణించిన అసెంబ్లీ మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం శాసనసభను వాయిదా వేశారు. తర్వాత సమావేశాల పని దినాలు, చర్చించే అంశాలపై బీఏసీ సమావేశం ఏర్పాటు చేసింది. 12, 13వ తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు.
Tue, 06 Sep 202208:31 AM IST
సంగం బ్యారేజీ ప్రారంభం
నెల్లూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. మూడేళ్లలో రూ.320కోట్ల రుపాయల వ్యయంతో నెల్లూరులో రెండు ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజక వర్గానికి రూ.85కోట్ల రుపాయల విలువైన పనుల్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Tue, 06 Sep 202208:23 AM IST
కేంద్రంలో సంకీర్ణం వస్తేనే ప్రత్యేక హోదా
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే హోదా వస్తుందని మాజీ ఎంపీ మేకపాటి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సుభిక్షం అవుతుందన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉందని, ఒడిశా సీఎం లాగే సుదీర్ఘ కాలం కొనసాగాలని కోరుకుంటున్నానని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.
Tue, 06 Sep 202207:32 AM IST
గుడివాడలో ఆందోళన
కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగు మహిళలు ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తెలుగు మహిళల ధర్నా నిర్వహించారు. - పోలీసులతో తెలుగు మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళలను కించపరిచిన మాజీ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Tue, 06 Sep 202207:31 AM IST
ఏపీ హైకోర్టులో విచారణ
ఎన్టీఆర్ వర్సీటీ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా పలువురు విద్యార్థులకు సీట్లు కేటాయించారని పిటిషనర్ తరపు లాయర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగిందన్న పిటిషనర్ తరపు లాయర్ జడ శ్రావణ్ ఆరోపించారు. ఈ కేసులో ప్రతివాదులు, ఎన్టీఆర్ వర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.
Tue, 06 Sep 202206:32 AM IST
నెల్లూరు చేరుకున్న సిఎం జగన్
నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించనున్నారు. సంగం బ్యారేజ్ తో 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. నెల్లూరు బ్యారేజ్ తో 99,525 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. మొత్తం 5 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. బ్యారేజ్ విశిష్టతను అధికారులు సీఎంకు వివరిస్తున్నారు.
Tue, 06 Sep 202206:27 AM IST
కాకినాడలో విద్యార్ధులకు అస్వస్థత
కాకినాడలో పలసపాక కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులు అస్వస్థకు గుయ్యారు. ఉదయం పాఠశాల ప్రారంభమైన వెంటనే విద్యార్ధులు ఒక్కొక్కరుగా సొమ్మసిల్లి పడిపోయారు. ఊపిరి అందడం లేదంటూ ఐదో తరగతి విద్యార్ధులు టీచర్లకు పిల్లలు ఫిర్యాదు చేయడంతో వారిని పాఠశాల ప్లే గ్రౌండ్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిలో కొందరు సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల వల్లే విద్యార్దులు సొమ్మసిల్లి ఉంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Tue, 06 Sep 202206:12 AM IST
శాసనసభ నిర్వహణపై ఆగ్రహం
బిఏసి సమావేశంలో అన్ని పార్టీలతో కలిసి చర్చించిన తర్వాతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, కేసీఆర్ అహంకారపూరితంగా మూడ్రోజులు సభ నిర్వహిస్తామని ప్రకటించడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదన్నారు.
Tue, 06 Sep 202206:07 AM IST
తెలంగాణ అసెంబ్లీ వాయిదా
దివంగత ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్థన్ లకు సంతాపం తెలిపిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అసెంబ్లీలో జరిగే బిఏసి సమావేశంలో శాసనసభా నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.
Tue, 06 Sep 202206:04 AM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత శాసన సభ్యులకు సంతాప తీర్మానాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
Tue, 06 Sep 202205:28 AM IST
సీపీఎస్ సమస్యపై చర్చలు
సీపీఎస్ పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏపీ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు AP CPSEA అధ్యక్ష, కార్యదర్శులతో చర్చలు జరుపనున్నారు.
Tue, 06 Sep 202205:26 AM IST
ఫుడ్ పాయిజన్
విజయనగరం జేఎన్టీయూ క్యాంపస్ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులకు తీవ్ర అస్వస్థతకు గరయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు.
Tue, 06 Sep 202205:24 AM IST
ఈడీ సోదాలు….
ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 30 చోట్ల ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‍లలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‍లో ఆరుచోట్ల ఈడీ తనిఖీలు చేపట్టారు. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరుతో పాటు హైదరాబాద్‍లో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు వచ్చాయి.
Tue, 06 Sep 202204:35 AM IST
హైదరాబాద్ విద్యార్ధినిపై అత్యాచారం
పుదుచ్చేరి జిప్‍మేర్‍లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. జిప్‍మేర్‍లో జరుగుతున్న సదస్సుకు హాజరైన విద్యార్థిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు దుండగులు .సీపీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కానిస్టేబుల్ కణ్ణన్‍తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tue, 06 Sep 202204:35 AM IST
ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ వాయిదా
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులు రాకపోవడంతో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలలకు వర్సిటీల నుంచి లభించని అనుబంధ గుర్తింపు రాకపోవడంతో వెబ్ ఆప్షన్లకు అనుమతించడం లేదు. వర్సిటీల అఫిలియేషన్ లభించకపోవడంతో కౌన్సెలింగ్ వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నిన్నటితో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Tue, 06 Sep 202204:35 AM IST
రైతు ఐకాస పిటిషన్‌పై విచారణ
పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిక్షణ సమితి దాకలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో పాదయాత్రకు అనుమతించాలంటూ అమరావతి పరిక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రకు అనుమతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ వేశారు.
Tue, 06 Sep 202204:35 AM IST
నేడు నెల్లూరుకు ఏపీ సిఎం జగన్
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. బ్యారేజీ ప్రారంభం తర్వాత బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు. పెన్నా నదిపై సంగం దగ్గర మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. వందేళ్లుగా నెల్లూరు ప్రజలు డిమాండ్ చేస్తున్న ఆనకట్ట సాకారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.