November 28 Telugu News Updates : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నందకుమార్‌పై 5 గంటల పాటు ప్రశ్నల వర్షం-andhra pradesh and telangana telugu live news updates 28 november 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 28 November 2022

ఎమ్మెల్యేలకు ఎర కేసు(HT)

November 28 Telugu News Updates : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నందకుమార్‌పై 5 గంటల పాటు ప్రశ్నల వర్షం

05:39 PM ISTB.S.Chandra
  • Share on Facebook
05:39 PM IST

‍‍November 28 Telugu News Updates : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. భైంసా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో యాత్రను నిర్వహిస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని కరీం నగర్‌లోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు.

Mon, 28 Nov 202211:23 AM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నందకుమార్‌పై 5 గంటల పాటు ప్రశ్నల వర్షం

ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్​ బంజారాహిల్స్​ పోలీసుల విచారణ చేశారు. నందకుమార్‌ను బంజారాహిల్స్ పీఎస్‌లో పోలీసులు చాలా సేపు ప్రశ్నించారు. సుమారు 5 గంటలపాటు విచారణ చేసి.. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి మంగళవారం నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు.

Mon, 28 Nov 202211:21 AM IST

బీజేపీ డ్రామాలకు ఓట్ల రాలవు

తెలంగాణలో బీజేపీ డ్రామాలకు ఓట్లు రాలవని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రజామద్దతులో మెదటి స్థానంలో అధికార పార్టీ టీఆర్ఎస్, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందన్నారు. రేవంత్​రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ సమావేశాల్లో ఈ విషయం గురించి ప్రస్తావిస్తానని చెప్పారు.

 

Mon, 28 Nov 202208:27 AM IST

రాజధాని కేసుల్లో ప్రభుత్వానికి పాక్షిక విజయం

రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి  సుప్రీం కోర్టులో పాక్షిక ఊరట లభించింది.  హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. - ఆరు నెలల్లో రాజధానిని పూర్తి చేయాలనడం కరెక్ట్ కాదని,  అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.   హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?  మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకని హైకోర్టు వాదనల సందర్భంగా ప్రశ్నించింది.  హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా అని సుప్రీం ప్రశ్నించింది.  అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని  హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని అభిప్రాయపడింది.  రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని, - ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేమని అభిప్రాయపడింది.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు  తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. 

Mon, 28 Nov 202207:38 AM IST

బండి సంజయ్ యాత్రకు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది.  పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని  హైకోర్టు అనుమతించింది.  పాదయాత్ర భైంసా టౌన్ నుంచి వెళ్లకూడదని,  భైంసాకి మూడు కిలోమీటర్లలో సభ జరుపుకోవాలన్న హైకోర్టు సూచించింది. 

Mon, 28 Nov 202206:42 AM IST

వైఎస్ షర్మిల అరెస్ట్ కి రంగం సిద్ధం.?

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న  వైఎస్ షర్మిలను  అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో  నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య సాగుతున్న పాదయాత్ర సాగుతోంది.  వైఎస్ షర్మిల పాదయాత్ర లో నలుగురు ఎసిపి లు,500 మంది పోలీస్‌లు పాల్గొంటున్నారు. షర్మిల  అరెస్ట్ ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైఎస్ షర్మిలను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమైనట్లుతెలుస్తోంది. 

Mon, 28 Nov 202205:22 AM IST

సిఎం ఇంటి ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్‌ రెడ్డి  ఇంటిని ముట్టడించాలని రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. దీంతో తాడేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంటు,ఒరియా, వాల్మీకి,బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాని వ్యతిరేకిస్తూ గిరిజనులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో  పోలీసులు అప్రమత్తమయ్యారు.  భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వైపు వెళ్ళే ప్రతి వాహనం తనిఖీ చేస్తున్నారు. 

Mon, 28 Nov 202204:19 AM IST

ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి….

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడులను అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని ఆరోపించారు.  తోపుదుర్తి సోదరులు తమకు ఎదురొస్తే ఎవరినైనా చంపుతామనే పద్ధతుల్లో తీవ్రవాఖ్యలు చేస్తున్నారని, అయిన దానికి  కాని దానికి కేసులు పెట్టి ప్రతిపక్షాలను వేధించే పోలీసు యంత్రాంగం తోపుదుర్తి సోదరుల విషయంలో కళ్ళు మూసుకుందా అని ప్రశ్నించారు. పోలీసులు సమక్షంలో ప్రత్యర్థులపై దాడిచేసే వాళ్లను పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 

Mon, 28 Nov 202204:20 AM IST

తిరుమలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

 కేంద్రమంత్రి గడ్కరీ నితన్‌ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.  ఉదయం 10 గంటలకు తిరుచానూరు వెళ్లనున్నారు. - తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.  మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

Mon, 28 Nov 202204:16 AM IST

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డి….

ఏపీ కొత్త సీఎస్‍గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జవహర్‌ రెడ్డి  గతంలో పలు శాఖల్లో పనిచేశారు. , టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.  ఎల్లుండితో  ప్రస్తుత సీఎస్ సమీర్‌ శర్మ పదవీకాలం ముగియనుంది.  2024 ఎన్నికల వరకు సిఎస్‌గా  జవహర్ రెడ్డి కొనసాగనున్నారు. 

Mon, 28 Nov 202204:14 AM IST

భీమవరంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళన

అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాట పట్టారు.   పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరంలో అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమబాట పట్టారు. నేటి నుంచి రెండు రోజులపాటు నిరాహార దీక్షలు చేయనున్నారు.  న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు ప్రకాశం చౌక్‍లో దీక్ష చేపట్టనున్నారు.

Mon, 28 Nov 202204:20 AM IST

వివేకా కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను వేరే రాష్ట్రానికి  బదిలీ చేయాలనే పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది.  ఏపీలో కాకుండా వేరే రాష్ట్రానికి విచారణ బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేసింది.  సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని  వైఎస్ సునీత పిటిషన్‍లో పేర్కొన్నారు.  ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‍పై కూడా నేడు తీర్పునివ్వనుంది. వివేకా హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్రగంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్‍పై ఉన్నారు.