February 02 Telugu News Updates : ఢిల్లి లిక్కర్ స్కాంలో మరో పరిణామం..-andhra pradesh and telangana telugu live news updates 02 february 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 02 February 2023

ఢిల్లీ లిక్కర్ కేసు

February 02 Telugu News Updates : ఢిల్లి లిక్కర్ స్కాంలో మరో పరిణామం..

05:16 PM ISTHT Telugu Desk
  • Share on Facebook
05:16 PM IST

  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. 

Thu, 02 Feb 202305:16 PM IST

బర్డ్ వాక్

ఈ నెల 4, 5 తేదీల్లో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో 'బర్డ్‌ వాక్‌' నిర్వహిస్తున్నారు. అటవీ సంపద, జీవ వైవిధ్యం, పరిశోధనల వంటి అంశాల గురించి పక్షి ప్రేమికులకు తెలిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాదే ఈ బర్డ్ వాక్ ను తొలిసారిగా నిర్వహించారు.

Thu, 02 Feb 202304:50 PM IST

సరికొత్త ప్యాకేజీ

irctc tourism madhyapradesh jyotirlinga tour package: పలు అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ట్రిప్ ప్యాకేజీని ప్రకటించింది. MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 8వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. షెడ్యూల్ చూస్తే....

Thu, 02 Feb 202301:58 PM IST

సీఎం జగన్ సమీక్ష

విద్యారంగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలనతో పాటు పాఠ్యపుస్తకాల్లో పేపర్‌ క్వాలిటీగా ఉండేలా చూడాలన్నారు.

Thu, 02 Feb 202301:10 PM IST

సవాల్

YS Sharmila Challenges Telangana CM KCR To Join Padyatra :సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె... ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. అవి వేసుకొని రాష్ట్రంలో తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవంటున్న సీఎం కేసీఆర్ అది నిజం అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్ చేశారు. అదే నిజం కాకపోతే సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ జిల్లా నుంచి ప్రజాప్రస్థానం యాత్రను పునఃప్రారంభించనున్నారు.

Thu, 02 Feb 202311:40 AM IST

కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది.

Thu, 02 Feb 202311:35 AM IST

వాహనం సీజ్

Nara lokesh campaign vehicle seized: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పలమనేరులో పోలీసులు సీజ్‌ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం పలమనేరులో లోకేశ్‌ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్‌ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. నిబంధనలకు విరుద్ధమంటూ సీజ్‌ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్‌ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Thu, 02 Feb 202310:31 AM IST

ప్రకటన

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ లో భారీగా నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఇందులోని పలు ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుండగా... మరిన్నింటిని ఆయా శాఖలు భర్తీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్​ఎస్​పీడీసీఎల్. ఖాళీగా ఉన్న మరో 1601 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓ ప్రకటన జారీ చేసింది.

Thu, 02 Feb 202309:39 AM IST

పరీక్ష తేదీ ఖరారు

TSPSC Group 4 Updates: గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జూలై 1వ తేదీన పరీక్ష నిర్వహించనుంది.

Thu, 02 Feb 202309:01 AM IST

మోసం.. నలుగురు అరెస్ట్

అతను ఓ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు..! ఓ సమయం వరకు బాగానే నడిచింది. ఇంతలోనే ఇబ్బందులు మొదలయ్యాయి. సంపాదన సరిపోవకపోవడంతో...మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం తన వద్ద పని చేస్తున్న మరో ముగ్గురిని జత చేసుకున్నాడు. తమ ప్లాన్ వర్కౌట్ చేసుకునేందుకు నకిలీ నోట్లను సీన్ లోకి తీసుకువచ్చారు. సీన్ కట్ చేస్తే అసలు విషయం బయటికి రావటంతో.. విషయం కాస్త పోలీసుల వద్దకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణను ముమ్మరం చేయగా... నకిలీ నోట్ల వ్యవహరం బయటికి వచ్చింది. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Thu, 02 Feb 202305:48 AM IST

నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జిగా ఆదాల

నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్‍రెడ్డిని నియమించారు. కోటంరెడ్డి వ్యవహారంతో ఆగ్రహంతో ఉన్న వైసీపీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరి  కాసేపట్లో  ముఖ్యమంత్రితో  ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ కానున్నారు. 

Thu, 02 Feb 202304:33 AM IST

విద్యాశాఖపై సిఎం సమీక్ష

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.  మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమీక్ష నిర్వహిస్తారు. 

Thu, 02 Feb 202304:32 AM IST

టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు

పల్నాడు జిల్లా  రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడిపై కాల్పులు  జరిగాయి. బాల కోటిరెడ్డికి ఆస్పత్రిలో కొనసాగిస్తున్నారు. కాల్పుల ఘటనతో  నరసరావుపేట ఆస్పత్రి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.  నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆస్పత్రిలో బాధితుడు కోటిరెడ్డిని  టీడీపీ నేతలు పరామర్శించారు. 

Thu, 02 Feb 202304:31 AM IST

బార్‌లో ఘర్షణ, ఇద్దరి హత్య

కడప పట్టణంలో  రఘు బార్ వద్ద  జరిగిన ఘర్షణలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. హతులను  రేవంత్, అభిలాష్ గా గుర్తించారు. బార్‌లో తలెత్తిన వివాదంతో  హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఒకరు, ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు.  కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Thu, 02 Feb 202304:30 AM IST

దర్శకుడు సాగర్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సాగర్  కన్నుమూశారు.  చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. స్టువర్టుపురం, అమ్మదొంగ  తదితర చిత్రాలకు సాగర్ దర్శకత్వం వహించారు.  తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు.