బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. న్యాయవాదిలో కలిసి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు కేసులో పోలీసులు ఐదుగురిని విచారించారు. తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. పరారీలో ఉన్నవారికి మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. భయ్యా సన్నీయాదవ్ ముందస్తు బెయిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణలో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుని, అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన యాంకర్లు, నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు.
ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యాప్ ప్రమోషన్‌కు చేసుకున్న ఒప్పందాలు, డబ్బులపై ఆరా తీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. యాంకర్ శ్యామలపై కూడా కేసు నమోదు అయ్యింది. కొంత మంది ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించారు.
బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసిన పలువురు ప్రముఖులు వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది, మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.
ఓ ఓటీటీ వేదికగా ప్రసారమైన షోలో ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ముగ్గురు కలిసి 'Fun88' అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారని ఇమ్మనేని రామారావు అనే వ్యక్తి మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ యాప్ ద్వారా లక్షలాది మంది మోసపోయారని, ఈ ముగ్గురు హీరోలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం