Siddipet Crime: సిద్ధిపేట లో రోడ్డు మీదే గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన వృద్ధుడు…
Siddipet Crime: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామం వద్ద రాజీవ్ రహదారి పక్కన ఘోర సంఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మధాపూర్ గ్రామానికి చెందిన ఏరుకుల రాజయ్య గౌడ్ (60) అనే వ్యక్తి కత్తితో గొంతు లో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
Siddipet Crime: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామం వద్ద రాజీవ్ రహదారి పక్కన ఘోర సంఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మధాపూర్ గ్రామానికి చెందిన ఏరుకుల రాజయ్య గౌడ్ (60) అనే వ్యక్తి కత్తితో గొంతు లో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర రక్తస్రావంతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజయ్య ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకున్న రాజయ్య గౌడ్ ను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
సర్పంచ్ వేధిస్తున్నాడు..
ఆత్మహత్య యత్నానికి గల కారణాలను బాధితుని అడగగా తన గ్రామానికి చెందిన సర్పంచ్ కర్రే వెంకటయ్య బెదిరింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు బాధితుడు ఆరోపించాడు.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తనకు ఇంకా గొంతులోనే కత్తి దిగి ఉండటంతో, డాక్టర్లు సర్జరీ చేసి తనను బ్రతికించడానికి శ్రయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. పూర్తీ వివరాల కోసం, గజవెల్ పోలీసులు రాజయ్య కుటుంబ సభ్యుల కు ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్ వద్దకు రావాలి చెప్పారు. రాజయ్య కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే, పూర్తి వివరాలు తెలుస్తాయని గజవెల్ పోలీసులు అంటున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కౌన్సిలింగ్…
రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో పట్టుబడ్డ వాహనదారులకు సిద్దిపేట లో ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం ఎలా అవుతున్నాయి, మరియు ట్రాఫిక్ వైలేషన్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దని, దానివల్ల మీకు ప్రమాదం మీ ఎదుటి వారికి ప్రమాదం ఉంటుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపినచో రోడ్డు ప్రమాదాల నివారించడం సులభం అవుతుందన్నారు. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన 20 వాహన యజమానులకు పాత పెండింగ్ చాలాన్స్ ఉన్న వాహనదారుల ద్వారా 12,935/- రూపాయలు కట్టించారు. వాహనాలపై పెండింగ్ చాలాన్ ఉన్న వాహనదారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సూచించారు. పదే పదే, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
తల్లితండ్రులు ఎవరైనా, మైనర్లకు బైకులు ఇస్తే, వారిపైన కూడా క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మైనర్లకు బైకులు ఇవ్వటం వలన, చాల మంది ప్రమాదంలో మరణిస్తున్నారని. వారి మరణం తల్లితండ్రులను తీవ్ర విషాదంలోకి నెడుతున్నదని అయన అభిప్రాయపడ్డారు.