TG Overseas Scholarships 2024 : రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు, అర్హతలివే-ambedkar overseas vidya nidhi scholarship registrations last date extended to 29th october 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Overseas Scholarships 2024 : రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు, అర్హతలివే

TG Overseas Scholarships 2024 : రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు, అర్హతలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 18, 2024 02:04 PM IST

TG Overseas Scholarships 2024 : విదేశీ విద్యానిధి స్కీమ్ కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అర్హులైన వారు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని సూచించింది.

విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు
విదేశీ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు

ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది.

గడువు పొడిగింపు..!

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థి సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలోపు మాత్రమే ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.

ముఖ్య వివరాలు :

  • ఈ స్కీమ్ లో భాగంగా ఎస్సీ విద్యార్థులు… అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లి చదువుకోవచ్చు.
  • ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ. 20 లక్షల వరకు ఉపకార వేతనం పొందవచ్చు.
  • కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
  • గ్రాడ్యూయేషన్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. GRE/GMAT లో అర్హత స్కోర్ ఉండాలి.
  • ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
  • అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిధి పధకంలో 20శాతం వెయిటేజీ ఉంటుంది.
  • టోఫెల్, ఐఈఎల్టీఎస్‌, పిటిఇలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్‌ ఎంపికలో స్కోర్‌ పరిగణలోకి తీసుకుంటారు.
  • విదేశాల్లోఅడ్మిషన్‌ పొందే యూనివర్శిటీల్లో స్కోర్‌ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.

అప్లికేషన్ కు కావాల్సిన పత్రాలివే:

  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయపత్రం(ఇన్ కామ్ సర్టిఫికెట్)
  • పుట్టిన తేదీ ధ్రువపత్రం
  • ఆధార్ కార్డు
  • ఈ- పాస్ ఐడీ నెంబర్
  • ఇంటి నెంబర్ వివరాలు
  • అడ్మిషన్ ఆఫర్ లెటర్ (ఫారెన్ యూనివర్శిటీ నుంచి)
  • బ్యాంక్ వివరాలు
  • ఫొటో
  • పాస్ పోర్టు కాపీ
  • పది, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల మెమోలు
  • • GRE /GMAT స్కోర్ కార్డు
  • • TOFEL / IELTS స్కోర్ కార్డు

NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం