OU JAC On Allu Arjun : బెదిరింపులు ఆగకపోతే, వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం- ఓయూ జేఏసీ హెచ్చరికలు
OU JAC On Allu Arjun : హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు వాపోతున్నారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. తన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ అదుపుచేయకపోతే వేలాది మందితో బన్నీ ఇంటిని ముట్టడిస్తామన్నారు.
OU JAC On Allu Arjun :సినీ నటుడు అల్లు అర్జున్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. అల్లు అర్జున్ అభిమానులు నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓయూ జేఏసీ పోరాటం వల్లే అల్లు అర్జున్ బాధితులను న్యాయం చేశారన్నారు. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కలిసి అల్లు అర్జున్ ఇంటి వస్తే తట్టుకోలేరని హెచ్చరించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంటిపై దాడి చేసినందుకు అల్లు అర్జున్ కు క్షమాపణలు చెప్పాలని అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో నిత్యం వందల కాల్స్ వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు వాపోయారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. తమ ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారన్నారు. మాకు ఫోన్ కాల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దేనని, ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. అలాగే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అరెస్టైన అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఇంటి ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. బన్నీ ఇంటిపైకి టమాటాలు విసిరారు. సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కోర్టు వారిని బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పాలని ఓయూ జేఏసీ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ ప్రారంభం అయ్యాయి. దీంతో ఓయూ జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. తాము పోరాటం చేయడం వల్ల అల్లు అర్జున్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చాయని ఓయూ జేఏసీ నేతలు అంటున్నారు.
సంబంధిత కథనం