Telugu News  /  Telangana  /  All Political Parties Are Focus On Komatireddy Rajagopalreddy Over Munugodu Bypoll 2022
మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక (HT)

Munugodu Bypoll: ఉప ఎన్నికలో అందరి టార్గెట్ ఆయనేనా..?

14 October 2022, 16:23 ISTHT Telugu Desk
14 October 2022, 16:23 IST

Munugodu Bypoll : మునుగోడు రాజకీయం రోజురోజుకూ ముదురుతోంది. బైపోల్ కు టైం దగ్గరపడుతున్న వేళ... మాటల తుటాలు పేల్చుతున్నారు నేతలు. అయితే దాదాపు అన్నీ పక్షాలు ఓ అభ్యర్థినే టార్గెట్ చేస్తున్నారు.

Munugodu bypoll 2022: అందరూ ఆయన్నే టార్గెట్ చేసేస్తున్నారు..! మాట ఎత్తితే 18 వేల కాంట్రాక్ట్ అంటున్నారు..! ఈ విషయంలో ప్రధాన ప్రత్యర్థులైన టీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వెళ్తున్నాయి. కేవలం రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం... బీజేపీ, టీఆర్ఎస్ లను కర్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ... వారి అసలు టార్గెట్ మాత్రం రాజగోపాల్ రెడ్డినే అన్నట్లు సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో... అసలు మునుగోడులో ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుందనే ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

రాజగోపాల్ రెడ్డి.... మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో చర్చ అంతా ఆయన చుట్టే...! ప్రతి పార్టీ... ఆయన ప్రస్తావ లేకుండా ప్రచారం చేయటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు..! ఈ విషయంలో టీఆర్ఎస్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కేవలం రూ. 18వేల కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక తీసుకువచ్చారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేస్తోంది. మునుగోడు అభివృద్ధి కోసం ఇదే రూ. 18 వేల కోట్లు కేటాయిస్తే... పోటీ నుంచి తప్పుకుంటామంటూ సవాల్ విసిరింది. ఫలితంగా రాజగోపాల్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ కోసం ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ముందుకెళ్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. రాజకీయంగా భవిష్యత్త్తు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని ఆరోపిస్తోంది. అన్నీ అవసరాల తీరాక.... కేవలం స్వార్థం కోసం, రూ. 18వేల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలోకి వెళ్లాడని ఆరోపిస్తోంది. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు... ఆయనతో వెళ్లొద్దని, అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం పని చేయాలని చెబుతోంది. ఇక టీఆర్ఎస్, బీజేపీ కూడా రెండు ఒక్కటే అంటూ... ఇరు పార్టీలపై మాటల దాడిని పెంచుతోంది. అయితే టీఆర్ఎస్ కంటే... రాజగోపాల్ రెడ్డినే ఎక్కువగా ప్రచారంలో టార్గెట్ చేస్తున్నట్లు పిక్చర్ కనిపిస్తోంది.

ప్రధాన పార్టీలే కాకుండా... ఇతర పార్టీలు కూడా రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ కోసం బీజేపీలోకి వెళ్లి ఉపఎన్నికను తీసుకువచ్చారని ఆరోపిస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నప్పటికీ.... బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని చెబుతున్నాయి. కమ్యూనిస్టులు టీఆర్ఎస్ తో జట్టు కట్టడంతో... వారు కూడా బీజేపీనే ఫోకస్ చేస్తున్నారు. మతతత్వ పార్టీలను ఓడించాలని.. కాంట్రాక్టుల కోసం వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని బుద్ధి చెప్పాలని అంటున్నాయి.

తాజాగా చండూరు మండల కేంద్రంలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లు కలకలం రేపాయి. ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా మునుగోడు బైపోల్ వార్ రాజగోపాల్ రెడ్డి చుట్టే చుట్టే తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ మాత్రం... ఆయన కాంట్రాక్ట్ అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా బీజేపీని ఎండగడుతూనే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తోంది.