Air Quality : అసలే చలికాలం.. ఆపై ఎయిర్ క్వాలిటీ సమస్య.. జాగ్రత్త-air quality decrease must follow preventive measures ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Air Quality Decrease Must Follow Preventive Measures

Air Quality : అసలే చలికాలం.. ఆపై ఎయిర్ క్వాలిటీ సమస్య.. జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 02:31 PM IST

Weather News : ఇప్పటికే శీతాకాలం మెుదలైంది. చలి విపరీతంగా పెడుతోంది. మరోవైపు గాలి నాణ్యత కూడా తగ్గుతోంది. ఉదయం, రాత్రి బయటకు వస్తే మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మౌలాలి దర్గా నుంచి హైదరాబాద్ వ్యూ
మౌలాలి దర్గా నుంచి హైదరాబాద్ వ్యూ

10 రోజులుగా ఉష్ణోగ్రతల తగ్గుదల భాగ్యనగరంలో గాలి నాణ్యత(Air Quality) పతనానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. బంజారాహిల్స్, కోటి, సెంట్రల్ యూనివర్శిటీ, సైదాబాద్, జూ పార్క్ సమీపంలోని ప్రాంతాల్లో వాయు కాలుష్యం(Air Pollution) ఎక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) విడుదల చేసిన రోజువారీ వాయు నాణ్యత బులెటిన్ ప్రకారం.. బుధవారం హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 103గా ఉంది. ఇది 'మోడరేట్'గా చెబుతారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

0 నుండి 50 వరకు ఉన్న AQI గాలి నాణ్యతకు మంచిదిగా పరిగణిస్తారు. 51 నుండి 100 మధ్యస్థంగా చూస్తారు. 101 నుండి 150 వరకు సున్నితమైన సమూహాలకు అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. 151 నుండి 200 అన్ని సమూహాలకు అనారోగ్యకరమైనది. 201 నుండి 300 చాలా అనారోగ్యకరమైనది. 301 మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా చెబుతారు.

CPCB డేటా ప్రకారం, 10 రోజులుగా హైదరాబాద్ AQI ఎక్కువగా 'మోడరేట్ జోన్'లో ఉంది. నవంబర్ 15న AQI 87తో చివరిగా 'మధ్యస్థ' రీడింగ్‌ను నమోదు చేసింది. హైదరాబాద్‌లో నవంబర్ 25 నుంచి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

డిసెంబర్ 1 తర్వాత దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉంది. ఉదయం 4 నుండి ఉదయం 8 గంటల మధ్య చలిగాలి ఉంటుంది. వివిధ కారణాల వల్ల కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. పటాన్‌చెరు, హకీంపేట, శంషాబాద్, దుండిగల్‌తోపాటుగా ఇతర ప్రాంతాలలో తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత(Air Quality) కారణంగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ సమస్యల పెరిగే అవకాశం ఉంది. ఉదయం పొగమంచులో తిరగడం కూడా సమస్యగా ఉంటుంది. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు మరింత సమస్యలు ఎదుర్కొంటారు. చలి, కాలుష్యం నుండి రక్షించుకునేందుకు.. మాస్క్‌లు, స్వెటర్లు, సాక్స్ వంటి వాటిని ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌(Hyderabad)లో శిలాజ ఇంధనాలు కాల్చడం, పారిశ్రామిక సంస్థల నిర్మాణం, ల్యాండ్‌ఫిల్‌ను తెరవడంతోపాటుగా గాలి నాణ్యత క్షీణించడానికి వాహన కాలుష్యం అతిపెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం, ప్రపంచంలోని అనేక ఇతర నగరాల మాదిరిగానే, హైదరాబాద్(Hyderabad) కూడా WHO గాలి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఒక క్యూబిక్ మీటర్ గాలికి 5 మైక్రోగ్రాములుగా ఉంది.

ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్న కణాలు మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ముక్కు చాలా.. ముతక కణాలను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ, సూక్ష్మమైన, అల్ట్రాఫైన్ కణాలు ఊపిరితిత్తులలోకి వెళ్తాయి. అవి అక్కడే ఉంటాయి. లేదంటే.. రక్తప్రవాహంలోకి కూడా వెళతాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం