Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్.. అధిష్ఠానం నుంచి నోటీసులు
Congress Party Notices To Komatireddy Venkat Reddy : భూవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పింది.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)కి కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చింది. మునుగగోడులో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలవదనే వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ తరఫున ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో పార్టీని చూసి కాదని, మనిషిని చూసి ఓటు వేయాలని ఇటీవల వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు(Munugode) స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ల్ చేసిన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని కామెంట్స్ చేశారు. ఈ విషయం అధిష్టానం దగ్గరకు వెళ్లింది. దీంతో ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఆడియో వైరల్ అయింది. పార్టీని చూడొద్దని బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)కి ఓటేయాలని చెప్పారు. అస్ట్రేలియా టూర్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చెప్పారు.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. విచారణ నిర్వహించి పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కు నివేదిక ఇచ్చారు. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి సమాచారం అందించారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది పార్టీ. ఈ నోటీసులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా రిప్లై ఇస్తారో చూడాలి.
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi).. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. హోంగార్డు, ఎస్పీ వ్యాఖ్యలతో ప్రచారానికి వెళ్లడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఎలాగైనా గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన మాణికం ఠాగూర్ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడారు. ఏఐసీసీ నాయకత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి.