TG Rythu Bharosa Funds : రైతు భరోసాపై కీలక ప్రకటన - నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ, ముందుగా వీరికే..!
రైతు భరోసా నిధుల జమపై కీలక అప్డేట్ వచ్చింది. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జనవరి 26వ తేదీన రైతు భరోసా స్కీమ్ ను లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు కేవలం మండలానికి ఒక గ్రామానికి చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేశారు. మిగతా గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు రాలేదు. అయితే ఈక్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల తాజా ప్రకటన చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగానూ ప్రారంభం కానుంది.
ముందుగా వీరికే….
గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పేరుతో అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు కూడా పెంచారు. దీంతో ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది.
రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది. గతంలోనూ గుంటల నుంచి మొదలుకొని అధిక విస్తీరణంలో ఉన్న భూములకు నిధులను జమ చేసేది. ప్రస్తుతం కూడా తక్కువ విస్తీరణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీరణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం