Magicians to Ayodhya: కండ్లకు గంతలు కట్టుకొని అయోధ్యకు మెజీషియన్ల సాహసం
Magicians to Ayodhya: కళ్లకు గంతలు కట్టుకుని బైక్‌పై మోటర్ సైకిల్‌పై అయోధ్యకు వెళుతున్నఇంద్రజాలికుల సాహస యాత్ర కామారెడ్డి చేరుకుంది.
Magicians to Ayodhya:హైదరాబాద్ నుండి అయోధ్య వరకు దాదాపు 1600 కిలోమీటర్ల వరకు కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ పైన యాత్ర చేస్తున్న మేజిషియన్ లు మారుతి జోషి, రామకృష్ణ లు కామారెడ్డి కి చేరుకున్నారు.
అయోధ్య వెళుతున్న మెజిషియనల్కు కామారెడ్డి బిజెపి నాయకులు స్వాగతం పలికారు. శనివారం ఉదయం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నుండి అయోధ్యకి బయలుదేరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్, బీజేపీ నాయకులు వారి కళ్లకి గంతలు కట్టి వారికి వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా మారుతి జోషి, రామకృష్ణ లు మాట్లాడుతూ... దశాబ్దాల కళ నెరవేరి అయ్యోద్య లో బల రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంగా మేము సైతం రాముని సేవలో జీవితం పరితాప్తం చేయాలని ఉద్దేశంతో కళ్లకి గంతలు కట్టుకొని నిన్న హైదరాబాద్ నుండి బయల్దేరామని వివరించారు.
కామారెడ్డి లో శుక్రవారం ఘన స్వాగతం పలికిన తరువాత ఈ రోజు యాత్ర ప్రారంభం చేశామని,శనివారం అదిలాబాద్ వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. కళ్లకి దూది పెట్టుకొని వాటిపై గంతలు కట్టిన తరువాత మొఖం మిధ నుండి ముసుగు వేసుకొని, హెల్మెట్ ధరించి బైక్ పై యాత్ర చేస్తున్నట్టు తెలిపారు.
(రిపోర్టింగ్ భాస్కర్, నిజామాబాద్)