TSRTC ITI Admissions: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు-admissions in hakeempet iti college under telangana road transport corporation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Iti Admissions: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు

TSRTC ITI Admissions: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు

HT Telugu Desk HT Telugu

TSRTC ITI Admissions: హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ తాజాగా అనుమతి ఇచ్చింది.

టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీలో అడ్మిషన్లు

TSRTC ITI Admissions: హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఐటీఐ కళాశాలను ప్రారంభించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది.

8 లోపు రిజిస్ట్రేషన్లకు గడువు..

10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగాhttps://iti.telangana.gov.in/వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోందని సంస్థ ప్రకటనలో వెల్లడించింది.

అతి తక్కువ వ్యవధిలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్ మరియు హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఆర్టీసి ఎండి సజ్జన్నార్ తెలిపారు.గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థను ప్రారంభించగా ఇప్పుడు తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చిందన్నారు.

వరంగల్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు.హకీంపేట కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం గల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుందని అయన పేర్కొన్నారు.

ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం లేదా ఎటువంటి సందేహాలు ఉన్నా 9100664452 ఫోన్ నంబర్ ని సంప్రదించాలని విసి సజ్జనార్ సూచించారు.

తరుణ్, హైదరాబాద్్ొ