OU Distance MBA MCA: ఉస్మానియా విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ దూర విద్యలో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో రెండేళ్ల M.B.A, M.C.A కోర్సులలో ప్రవేశం నిమిత్తం ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలో డిస్టెన్స్ విద్య విధానంలో రెండేళ్ల ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో యూజీసీ-డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు అనుమతించిన కోర్సుల్ని ప్రొఫెసర్ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించనున్నారు.
ఉస్మానియాలో దూర విద్యా విధానంలో రెండేళ్ల ఎంబిఏ, ఎంసిఏ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ లింకు ద్వారా చూడొచ్చు..
ప్రవేశపరీక్షను నవంబర్ 9వ తేదీన నిర్వహిస్తారు.
తెలంగాణ, ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేసుకునే అభ‌్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. ఎంబిఏ కోర్సులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కలిగి ఉండాలి. పదవ తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా పది తర్వాత ఇంటర్ తో పాటు నాలుగేళ్ల డిగ్రీ, పది తర్వాత మూడేళ్ల డిప్లోమా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబిఏ కోర్సులకు దరఖాస్తు చేయవచ్చు. పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంసిఏ కోర్సులకు పది తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్, డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంసిఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్ చదివి ఉండాలి. దూర విద్యలో మ్యాథ్స్ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారు. డిగ్రీలో మ్యాథ్స్ చదవని విద్యార్థులు ఇంటర్‌లోనైనా మ్యాథ్స్ సబ్జెక్టును చదివి ఉండాలి.
దరఖాస్తు సమయంలో అభ్యర్థుల విద్యార్హతలు పరిశీలన జరగదని, కోర్సులో ప్రవేశాలకు తగిన అర్హత ఉందో లేదో నిర్ధారించుకోవాలని అడ్మిషన్స్ విభాగం సూచించింది.
మరిన్ని వివరాలు ఓయూ అధికారిక http://www.ouadmissions.com / www.osmania.ac.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.