ACB Raids : ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత-adilabad veterinary doctor got red handed for taking bribe for duty certificate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raids : ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

ACB Raids : ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

HT Telugu Desk HT Telugu
Jan 29, 2025 10:50 PM IST

ACB Raids : తెలంగాణ ఏసీబీ అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తుంది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రమేష్ రాథోడ్ లంచం తీసుకంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

ACB Raids : అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తుంది. వరుస దాడులతో హడలెత్తిస్తుంది. అయినా కొంతమంది అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ వెటర్నరీ డాక్టర్ ఏసీబీ అధికారులు చిక్కారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (పశువుల డాక్టర్) రమేష్ రాథోడ్ ఏసీబీ వలకు చిక్కారు. బుధవారం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు.

yearly horoscope entry point

డ్యూటీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఉదయ నాయక్ తండాలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేసిన జుగ్నాక మాధవ్ ఇటీవల బదిలీ అయ్యారు. తన ఉద్యోగ విధులకు సంబంధించి రెండు నెలల డ్యూటీ సర్టిఫికెట్ కు జారీ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ రమేష్ ను సంపద్రించారు. ఇందుకు రూ.15 వేలు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ చేస్తానని చెప్పారు. దీంతో మాధవ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన కుమారుడు జుగ్నాక గంగాధర్ ద్వారా రూ.15 వేలు లంచం ఇస్తుండగా అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ రమేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఎస్ఐ లంచావతారం

ఓ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న వ్యక్తిని కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన కంది సుధాకర్ రూ.12500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండండ్ గా పట్టుబడ్డారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner